ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: స్త్రీపురుషులు వేర్వేరు సమయాల్లో ఎక్సర్‌సైజులు చేయాలా?

ABN, Publish Date - Jun 30 , 2024 | 07:31 PM

కసరత్తులు చేసేందుకు స్త్రీ పురుషులకు వేర్వేరు సమయాలు అనువని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. ఈ ఫలితం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.

ఇంటర్నెట్ డెస్క్: కసరత్తులతో కలిగే ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. ఇక చాలా మంది ఉదయం ఎక్సర్‌సైజులు చేసేందుకు ఇష్టపడితే కొందరు సాయంత్రాలు బెటరని భావిస్తారు. అయితే, కసరత్తులు చేసేందుకు స్త్రీ పురుషులకు వేర్వేరు సమయాలు అనువని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. ఈ ఫలితం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. స్కిడ్‌మోర్ కాలేజీ పరిశోధకులు నిర్వహించారు. తమ పరిశోధన గురించి ప్రొఫెసర్ పాల్ జే ఆర్సీరియో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సంచలనంగా (Health) మారింది.

ఈ అధ్యయనం కోసం స్త్రీ, పురుషులతో వేర్వేరు సమయాల్లో ఎక్సర్‌సైజులు చేయించి ఫలితాలను పరిశీలించారు. రక్తపోటు, పొట్టచుట్టు కొవ్వు తగ్గించుకునేందుకు ప్రయత్నించే మహిళలు ఉదయం పూట్ ఎక్సర్‌సైజులు చేస్తే మంచి ఫలితం ఉంటుందట. అయితే, శరీరం పై భాగంలో కండరాల ద్రుఢపరుచుకునే మహిళలకు సాయంత్రం వేళ కసరత్తులు తగినదని పరిశోధకులు గుర్తించారు (Best time to exercise for men and women).

Weight Loss: ఈ 6 కసరత్తులతో డైటింగ్ లేకుండానే బరువు తగ్గుతారు! ఇది పక్కా!


పురుషుల విషయంలో కూడా ఈ వ్యత్యాసాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సాయంత్రం వేళల్లో కసరత్తులు చేసే పురుషుల్లో రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటివి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయట. అయితే, కొవ్వు కరిగించి కండలు పెంచాలంటే మాత్రం పురుషులకు ఉదయం పూట కసరత్తులే మెరగని ఈ అధ్యయనంలో తేలింది. ఇందుకు గల కారణాలు పూర్తిగా తెలియాలంటే మరింత అధ్యయనం జరగాలని శాస్త్రవేత్తలు చేశారు. జనాలకు ఏయే సమయాల్లో నిద్ర ఎక్కువగా వస్తుందనే దానిపై కూడా కసరత్తులకు అనువైన సమయం ఆధారపడి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read Health and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 07:32 PM

Advertising
Advertising