ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bone Health: ఎముకలు ఉక్కులా బలంగా మారాలి అంటే వేసవిలో తప్పక తినాల్సిన 10 ఆహారాలు ఇవీ..!

ABN, Publish Date - Apr 08 , 2024 | 02:51 PM

అటు శరీరానికి చలువదనాన్ని ఇస్తూ, ఎముకల ఆరోగ్యానికి దోహదపడే ఈ ఆహారాల గురించి తెలుసా?

ఆహారమే ఆరోగ్యం అని అంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. శరీరంలో ఎముకలు, కండరాలు బలంగా ఉండటానికి ప్రోటీన్, కాల్షియం ప్రధాన పాత్ర వహిస్తాయి. శరీరానికి తగినంత కాల్షియం అందకపోతే శరీరంలో ఎముకలు బలహీనంగా మారతాయి. వేసవి కాలంలో వేసవి తాపం భరించలేక చల్లని ఆహారాలు, పానీయాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అయితే అటు శరీరానికి చలువదనాన్ని ఇస్తూ, ఎముకల ఆరోగ్యానికి దోహదపడే ఆహారాలేంటో తెలుసుకుంటే..

పెరుగు..

వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకుంటారు. 100 గ్రాముల పెరుగులో దాదాపు 85 mg కాల్షియం ఉంటుంది. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే పెరుగు తినండి.

ఇది కూడా చదవండి: విటమిన్-సి బూస్టింగ్ ఆహారాల గురించి తెలుసా?


దోసకాయ..

దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో ఎక్కువగా తింటారు. ఇది శరీరంలో నీటి కొరతను నివారిస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

టమోటా..

ఎర్రటి టమోటాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుండి, క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తాయి. వీటిలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలకు అవసరమైన ఖనిజం.

నిమ్మకాయ..

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో లెక్కించబడతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు ఎముకలు బలహీనపడకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పుచ్చకాయ..

పుచ్చకాయ ముక్కలు లేదా జ్యూస్ వేడి నుండి ఉపశమనం పొందడానికి మంచి మార్గం. ఈ పండు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు కూడా మేలు చేస్తుంది.

మామిడి..

ఎముకల సాంద్రత, బలాన్ని పెంచుతుంది. యాంటాక్సిడెంట్లు, పోషకాలతో సమృద్ధిగా ఉన్న మామిడి రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఫోర్టిఫైడ్ ఫుడ్స్..

బలవర్ధకమైన నారింజ రసం, తృణధాన్యాలు, పాల ప్రత్యామ్నాయాలు తీసుకోవడం మంచిది. వీటిలో కాల్షియం, విటమిన్ డి మంచి పరిమాణంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి సమ్మర్ డైట్‌కి రిఫ్రెష్ డ్రింక్స్ గా పనిచేస్తాయి.

పచ్చని ఆకుకూరలు..

పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఎముకల వ్యాధుల నుండి రక్షిస్తాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి. . ఇవి కాకుండా గుడ్లు, గింజలు, విత్తనాలు, టోఫు వంటి సోయా ఉత్పత్తులను కూడా తీసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 02:51 PM

Advertising
Advertising