Botox: బొటాక్స్ అంటే ఏంటి? ఇది చర్మాన్ని యవ్వనంగా ఎలా మారుస్తుందంటే..!
ABN, Publish Date - Sep 19 , 2024 | 04:58 PM
చర్మం యవ్వనంగా ఉండటం కోసం చర్మ సంరక్షణ నిపుణులు పర్యవేక్షణలో బొటాక్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదెలా చేస్తారంటే..
చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. పురుష పుంగవులు కూడా అందం విషయంలోనూ వయసులో చిన్నగా కనిపించాలని చేసే ప్రయత్నాలలోనూ తగ్గడం లేదు. సహజ సౌందర్యం కాకుండా అందంగా కనిపించడం కోసం ఇప్పట్లో బ్యూటీ ట్రీట్మెంట్ లో భాగంగా చాలా రకాల చికిత్సలు అందిస్తున్నారు. చర్మ వైద్యుల పర్యవేక్షణలో జరిగే ఈ చికిత్సలలో బొటాక్స్ కూడా ఒకటి. బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇంతకీ బొటాక్స్ అంటే ఏంటి? ఇది చర్మాన్ని యవ్వనంగా ఎలా మారుస్తుంది? తెలుసుకుంటే..
Parenting: నలుగురిలో పిల్లలను తిడుతున్నారా? ఈ పర్యవసానాలు తప్పవు..!
బొటాక్స్ అంటే..
బొటాక్స్ అనేది చర్మంలో ముడతలు, గీతలను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రసిద్ధ ఇంజెక్షన్ బ్యూటీ ట్రీట్మెంట్.
బొటాక్స్ ఎలా చేస్తారు..
వైద్యులు మొట్టమొదట ముఖం పై నంబింగ్ క్రీమ్ రాస్తారు. బొటాక్స్ చేయడానికి నిర్థేశించిన సూదిని ఉపయోగించి చర్మం మీద ఇంజెక్షన్ చేస్తారు. ఈ ప్రక్రియ 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఉంటుంది.
ప్రభావం..
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే జీవితకాలం చర్మం యవ్వనంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే.. బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ 8 నుండి 12 నెలల వరకు ఉంటుంది. దీని వల్ల ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయి.
Kitchen Hacks: టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా ఏంటి?
ప్రయోజనాలు..
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ నుదుటిపైన, కళ్ల పైన ముడతలు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే ముఖం పై అధికంగా చెమట పట్టే సమస్య తగ్గుతుంది.
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గించుకోవడానికి చాలామంది బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!
నష్టాలు..
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మైగ్రేషన్ సమస్య ఉన్నవారిలో బొటాక్స్ ఇంజెక్షన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.
ముఖం, పెదవులు, గొంతు వంటి ప్రదేశాలలో తీవ్రమైన వాపు, అలెర్జీ వంటివి బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల వస్తాయి.
బొటాక్స్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు శ్వాస సమస్యలు కలిగిస్తుంది. ఆ తరువాత దీనికి పరిష్కారం కూడా ఉంటుంది. కానీ శ్వాస సమస్యలు వచ్చే అపకాశం ఉంటుంది.
దీని ఖర్చు ఎంతంటే..
బొటాక్స్ ట్రీట్మెంట్ ఖర్చు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. భారతదేశంలో అయితే బొటాక్స్ ట్రీట్మెంట్ ఖర్చు 15 వేల నుండి 36 వేల మధ్య ఉంటుంది.
రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!
మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 19 , 2024 | 04:58 PM