Viral: పిల్లల్లో బీపీ, కిడ్నీ సమస్యలు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ABN, Publish Date - Jul 07 , 2024 | 09:34 PM
వయసు మీరిని వారికి మాత్రమే పరిమితమవ్వాల్సిన బీపీ, కిడ్నీ సంబంధిత సమస్యలు దురదృష్టవశాత్తూ పిల్లల్లోనూ కనిపిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను, వీటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సవివరంగా వివరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వయసు మీరిని వారికి మాత్రమే పరిమితమవ్వాల్సిన బీపీ, కిడ్నీ సంబంధిత సమస్యలు దురదృష్టవశాత్తూ పిల్లల్లోనూ కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గల కారణాలను, వీటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సవివరంగా వివరిస్తున్నారు (Health).
వైద్యుల ప్రకారం, కిడ్నీ సమస్యలు, హైబీపీ మధ్య సంబంధం సంక్లిష్టమైనది. హార్మోన్ల ప్రభావం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ద్వారా కిడ్నీ బీపీని నియంత్రిస్తుంది. మరోవైపు, హైబీపీ కారణంగా కిడ్నీల్లోని రక్తనాళాలు చిట్లీ సమస్యలు మొదలవుతాయి. ఫలితంగా ఇదంతా ఓ విషవలయంలా మారుతుంది (BP, kidney related cases on rise in kids experts share tips to manage).
Talc: రోజూ ముఖానికి పౌడర్ రాసుకుంటారా? అయితే మీకో అలర్ట్!
డాక్లర్ల ప్రకారం, కసరత్తులు, ఇతర ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, నిత్యం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లతో గడిపేస్తూ కదలకుండా ఉండిపోవడం, అనారోగ్యకారక ఆహారం, ఊబకాయం, నిరంతర ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, జన్యు సంబంధిత కారణాలు, డయాబెటిస్ టైప్ 2 కారణంగా పిల్లల్లో కూడా హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
ఈ వ్యాధులు సోకకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. పొగాకు, మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలి. ఒత్తిడిని, బరువును నియంత్రించుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. వైద్యుల సలహార మేరకే ఔషధాలు వినియోగించాలి. బీపీ, కిడ్నీ వ్యాధుల లక్షణాలపై అవగాహన పెంచుకుంటే వీటిని ముందుగానే గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టొచ్చు.
Updated Date - Jul 07 , 2024 | 09:34 PM