Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:31 PM
మసాజ్ అనేది శరీరానికి చాలా మంచి ఓదార్పును ఇస్తుంది. కొందరు శరీరానికి మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు తలకు మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. దీనికోసం నూనెను ఉపయోగించడం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే మసాజ్ కోసం కాంస్య పాత్రలను వాడటం.
మసాజ్ అనేది శరీరానికి చాలా మంచి ఓదార్పును ఇస్తుంది. కొందరు శరీరానికి మసాజ్ చేయించుకుంటారు. మరికొందరు తలకు మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. దీనికోసం నూనెను ఉపయోగించడం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే మసాజ్ కోసం కాంస్య పాత్రలను వాడటం. అసలు కాంస్య పాత్రలతో మసాజ్ ఎందుకు చేస్తారు? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుంటే..
బ్రాంజ్ ఫుట్ మసాజ్ థెరపీ చాలా ప్రాచుర్యం చెందిన వైద్య చికిత్స. ఇందులో చిన్న కాంస్య గిన్నెలను ఉపయోగిస్తారు. ఇది రాగి,జింక్, టిన్ తో కూడిన మిశ్రమం. ఈ కాంస్య గిన్నెలతో మసాజ్ చేయడం ల్ల పాదాలలోని నరాల చివర్లు ప్రభావితం అవుతాయి. ఇది పాదాల బలాన్ని పెంచుతుంది. ప్రశాంతతను ఇస్తుంది.
ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందంటే..!
దీన్ని ఎలా చేయాలంటే..
పాదాలను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత కాటన్ టవల్ తో తేమ లేకుండా తుడుచుకోవాలి. అరికాళ్లకు నెయ్యి లేదా కొబ్బరినూనె రాయాలి. ఇప్పుడు అరికాళ్లను కాంస్య గిన్నెతో మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన 2గంటల తరువాత మాత్రమేఅరికాళ్లను కడుక్కోవాలి.
ఏయే సమస్యలు తగ్గుతాయంటే..
మోకాళ్ల నొప్పులు, చీలమండలు తగ్గుతాయి.
శరీరంలో వేడి అధికంగా ఉన్నవారు కాంస్య పాత్రతో మసాజ్ చేసుకుంటే వేడి తగ్గుతుంది.
ఎప్పుడూ అలసటగా ఫీలయ్యేవారు ఈ మసాజ్ చేసుకోవడం ద్వారా అలసట తగ్గుతుంది.
పాదాల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
పాదాల చిపర్లో ఉన్న నరాలు ప్రభావితం కావడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ తగ్గుతుంది.
శరీరంలో అంతర్గత అవయవాలను శుద్ది చేయడంలో సహాయపడుతుంది.
పాదాలు చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉండటంలో మెరుగుపరుస్తుంది.
కాళ్లలో నరాలలో రక్తం గడ్డకట్టడం వల్ల ఎదురయ్యే వెరికోస్ వెయిన్స్ సమస్యలు పరిష్కరిస్తుంది.
పాదాల పగుళ్లను నయం చేస్తుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
కంటి అలసట, కంటి కింద నల్లటి వలయాల నుండి ఉపశమనం ఇస్తుంది.
మంచి నిద్ర వచ్చేలా చేసి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందంటే..!
ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 27 , 2024 | 05:31 PM