ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pigeons: పావురాలతో ఇంత డేంజరా.. బాలుడు ఆసుపత్రిపాలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:24 PM

మీ ఇంట్లో పావురాలు పెంచుకుంటున్నారా, మీ ఇంటి మేడపైకి పావురాలు రావాలని గింజలు చల్లుతున్నారా. అయితే ఇప్పుడే ఆ పనులు మానుకోండి. పావురాలు మనుషులకు ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన ఒకటి బయటపడింది. పావురాల ఈకలు, వ్యర్థాలకు బహిర్గతం అయిన 11 ఏళ్ల బాలుడు తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో పావురాలు పెంచుకుంటున్నారా, మీ ఇంటి మేడపైకి పావురాలు రావాలని గింజలు చల్లుతున్నారా. అయితే ఇప్పుడే ఆ పనులు మానుకోండి. పావురాలు మనుషులకు ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన ఒకటి బయటపడింది. పావురాల ఈకలు, వ్యర్థాలకు బహిర్గతం అయిన 11 ఏళ్ల బాలుడు తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తూర్పు ఢిల్లీకి చెందిన బాలుడు అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. పావురం కారణంగా బాలుడికి హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP) సోకినట్లు గుర్తించారు. అత్యవసర వైద్యం అందించాలని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) కో-డైరెక్టర్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు.


వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తులు వాపు గురైనట్లు గుర్తించారు. ఊపిరితిత్తులో మచ్చలు కూడా ఉన్నాయని, బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుప్తా తెలిపారు. ఈ పరిస్థితి పెద్ద వారిలో ఎక్కువగా ఉంటుందని, పిల్లల్లో అసాధారణంగా సంభవిస్తుందని చెప్పారు. ఏటా లక్ష మందిలో 2 - 4 కేసుల్లోనే ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు.


బాలుడికి స్టెరాయిడ్ చికిత్స అందించి, ఆక్సిజన్ థెరపీ ద్వారా కృత్రిమ శ్వాస ఇచ్చినట్లు వెల్లడించారు. ట్యూబ్ ద్వారా నాసికా రంధ్రాల్లోకి ఆక్సిజన్‌ని శరీరంలోకి పంపించి, ఊపిరితిత్తుల వాపును తగ్గించగలిగారు. తద్వారా బాలుడి శ్వాస సాధారణ స్థితికి చేరుకుంది. అతని ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పావురాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వాటిపై ఉండే ప్రమాదకర శిలింధ్రాలు, ఈకలు, మలమూత్ర విసర్జన‌ని తాకితే శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయని.. తద్వారా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

For Latest News and National News

Updated Date - Jul 12 , 2024 | 06:05 PM

Advertising
Advertising
<