ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken: చికెన్ తింటే జలుబు తగ్గుతుందా.. వెంటనే రిలీఫ్ ఇచ్చే టిప్స్ ఇవే

ABN, Publish Date - Nov 14 , 2024 | 07:27 PM

వాతావరణ మార్పులతో అందరినీ జలుబు వేధిస్తోంది. ఇలాంటప్పుడు వేడి వేడి చికెన్ తింటే..

Chicken

ఒక్కసారి వచ్చిందంటే కనీసం మూడు నుంచి వారం పది రోజుల వరకు తిష్ట వేసుకుని కూర్చుంటుంది జలుబు. దీంతో పాటు ముక్కు దిబ్బడ, ముఖంలోని కండరాలు పట్టేయడం, ముక్కు నుంచి ద్రవాలు కారడం వంటి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. కొందరికి శ్లేష్మం ఎక్కువగా వస్తుంటుంది. అయితే, జలుబును యాంటీ బయోటిక్స్ తో పూర్తిగా నయం చేయలేమన్న సంగతి తెలిసిందే. అందుకే కొందరు వేడివేడిగా చికెన్ వండుకుని తింటే జలుబు నయమవుతుందంటారు. నిజానికి చికెన్ లో జలుబును తగ్గించే గుణాలు ఉన్నాయా? అంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.


చికెన్ ను జలుబుకు విరుగుడుగా తీసుకోవడం వందల ఏళ్ల నుంచీ వస్తున్నదే. అయితే, విదేశాల్లో చికెన్ ను సూప్ గా తీసుకునేవారు. ఇందులో విటమిన్లు అందేలా కూరగాయలను చేర్చుతారు.

జలుబు శరీరాన్ని నీరసించేలా చేస్తుంది. అందువల్ల చికెన్ నుంచి అందే ప్రొటీన్ బాడీకి తిరిగి ఉత్తేజాన్ని అందిస్తుంది. అందువల్ల చికెన్ తీసుకుంటే జలుబు నుంచి రిలీఫ్ కలుగుతుందంటారు.


చికెన్ వంటకంలో వాడే మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, మిరియాలు ఇలా అన్నీ జలుబును తగ్గించే గుణాలు కలిగినవే కావడం వల్ల తొందరగా తగ్గించుకోవచ్చు.

జలుబుతో పాటు జ్వరం ఉన్నవారు చికెన్ ను సూప్ లా తయారుచేసుకోవడం మేలు. ఎందుకంటే జీర్ణశక్తి మందగించినప్పుడు ఇలాంటి పదార్థాలను అరిగించుకోవడం కష్టం అవుతుంది.


ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమయ్యే ప్రోటీన్లను అందించేలా చికెన్ సూప్‌ను సిద్ధం చేసుకోవాలి. సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

మసాలా దినుసుల వల్ల ఏర్పడే ఘాటు వాసనలు మూసుకుపోయిన ముక్కు నాళాలను క్లియర్ చేస్తాయి. అందువల్ల జలుబు నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

Recall Method: ఈ టెక్నిక్ ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం!


Updated Date - Nov 14 , 2024 | 07:30 PM