ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Climate Change: ఆ వ్యాధిగ్రస్తులకు వాతావరణ మార్పు ముప్పు.. లాన్సెట్ జర్నల్‌ నివేదికలో ఆందోళనకర విషయాలు

ABN, Publish Date - May 19 , 2024 | 02:57 PM

వాతావరణ మార్పుతో(Climate Change) పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ది లాన్సెట్ జర్నల్(The Lancet Journal) నివేదిక ప్రచురించింది. మైగ్రేన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తేలింది.

ఇంటర్నెట్ డెస్క్: వాతావరణ మార్పుతో(Climate Change) పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ది లాన్సెట్ జర్నల్(The Lancet Journal) నివేదిక ప్రచురించింది. మైగ్రేన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తేలింది. యూకేలోని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లోని న్యూరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు సంజయ్ సిసోడియా మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మెదడు సంబంధిత వ్యాధులను ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు. "రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నిద్రకు భంగం కలిగిస్తాయి.


పేలవమైన నిద్ర మెదడు సంబంధిత వ్యాధులను పెంచుతుంది" అని ఆయన అన్నారు. 1968 నుండి 2023 వరకు 332 ప్రచురణలను పరిశీలించాక స్ట్రోక్, మైగ్రేన్, అల్జీమర్స్, మెనింజైటిస్, మూర్ఛ, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా 19 రకాల నాడీ వ్యవస్థ రుగ్మతలపై అధ్యయనం దృష్టి సారించింది. వాతావరణ మార్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌ మరణాల పెరుగుదలను పరిశోధకులు గమనించారు. సీజన్ మారినప్పుడు వ్యాధిగ్రస్తులు అందుకుతగినట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 02:57 PM

Advertising
Advertising