Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిదంటే..
ABN, Publish Date - Oct 25 , 2024 | 06:41 PM
జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె లేదా నెయ్యి రెండూ సురక్షితమైనవే.. కానీ ఈ రెండింటిలో ఏది వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటే..
కొబ్బరి నూనెను చాలామంది హెయిర్ అయిల్ గా ఉపయోగిస్తారు. ఒక పదేళ్ల కిందట ఎక్కడ చూసినా సాధారణ కొబ్బరి నూనెను తలకు ఉపయోగించేవారు. ఇప్పుడు ఉన్నన్ని హెయిర్ ఆయిల్స్, షాంపూలు, కండీషనర్లు వంటివి అప్పట్లో లేవు. అయినా అప్పట్లో జుట్టు చాలా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేది. కానీ ఇప్పట్లో మాత్రం అలా కాదు.. జుట్టు పెరుగుదల కోసం చాలా రకాల ఆయిల్స్, షాంపూలు, కండీషనర్లు ఉపయోగిస్తున్నారు. అయితే నెయ్యిని కూడా తలకు ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు. కొబ్బరినూనె లేదా నెయ్యి రెండింటిలో జుట్టు పెరుగుదలకు ఏది ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుంటే..
Dhana Trayodashi: బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..
కొబ్బరినూనె..
కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇందులో లారిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్ అని పిలుస్తారు. చాలాకాలం నుండి కొబ్బరినూనెను వంటకోసం, చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె తేలికగా ఉంటుంది. చర్మం,జుట్టు లోకి తొందరగా గ్రహించబడుతుంది. అందుకే చాలామంది దీన్ని ఎంచుకుంటారు.
కొబ్బరి నూనె జుట్టులోకి ఇంకిపోయి తేమను నిలిపి ఉంచుతుంది. తద్వారా జుట్టు పొడిబారకుండా ఆపుతుంది. గిరిజాల జుట్టు ఉన్నవారికి ఇది చాలా మంచిది.
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడం ద్వారా జుట్టును బలపరుస్తుంది. జుట్టును స్టైల్ చేసేటప్పుడు లేదా పర్యావరణ కారకాల వల్ల నష్టం తక్కువగా ఉంటుంది.
యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కొబ్బరినూనెలో ఉంటాయి. ఇవి స్కార్ఫ్ ఆరోగ్యంగా ఉండటంలో చుండ్రు లేదా స్కాల్ప్ సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడతాయి.
కొబ్బరినూనెను రెగ్యులర్ గా వినియోగించడం వల్ల జుట్టు మెరుస్తుంది.
Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..
నెయ్యి..
నెయ్యి భారతీయ సాంప్రదాయంలో భాగం. ఆయుర్వేదంలోనూ, ఆహారంలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యిలో విటమిన్-ఎ, డి, ఇ, కె ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు పోషణను ఇస్తాయి.
నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను ఇస్తాయి.
నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
నెయ్యి కొబ్బరి నూనెతో పోలిస్తే చిక్కగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది. చిట్లిన జుట్టును రిపేర్ చేస్తుంది.
నెయ్యి జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..
ఏది మేలు..
కొబ్బరినూనె, నెయ్యి రెండు జుట్టుకు మేలు చేస్తాయి. జుట్టు రకాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే కొబ్బరి నూనె తేలికగా ఉండటం వల్ల దీన్నిజుట్టుకు అప్లై చేసి అలాగే ఉంచుకోవచ్చు. ఇక నెయ్యి జుట్టుకు పోషణను ఇస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట నుండి గంట ఆగి తలస్నానం చేయవచ్చు. డ్యామేజ్ అయిన జుట్టు త్వరగా రికవర్ కావాలంటే నెయ్యి మంచిది. ఇది జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న జుట్టును మెయింటైన్ చెయ్యాలంటే కొబ్బరినూనె మంచిది. అందుకే కొబ్బరినూనె కంటే నెయ్యి మంచిది.
ఇవి కూడా చదవండి..
Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..
Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 25 , 2024 | 06:41 PM