Cucumber Juice: వేసవిలో కీర దోస జ్యూస్ మిస్సవకుండా తాగాలని చెప్పేది ఇందుకే..!
ABN, Publish Date - Mar 28 , 2024 | 02:15 PM
వేసవికాలంలో రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగినా చాలు.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..
కీరాదోస చాలామంది ఇష్టంగా తినే కూరగాయ. దీన్ని నార్మల్ గానూ, సలాడ్ లోనూ, వివిధ రకాల స్నాక్స్ లోనూ, జ్యూస్ గానూ ఇలా.. చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది కీరాదోస జ్యాస్ ను రిఫ్రెష్ గా ఉంటుందని, శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని ఉదయాన్నే తాగడానికి ఇష్టపడతారు. కీరాదోసలో పోషకాలు, ఫైబర్, నీటిశాతం అధికంగా ఉంటాయి. వేసవికాలంలో దీన్ని ఖచ్చితంగా తీసుకుంటే ఏం జరుగుతుందంటే..
చర్మానికి..
చర్మం మీద వాపులు, చికాకులు తగ్గించడంలో కీరాదోస సహాయపడుతుంది. ఇది చర్మం మెరుస్తూ కాంతివంతంగా కనిపించడానికి దోహదం చేస్తుంది. దోసకాయ జ్యూస్ తాగడం వల్ల వేసవిలో సూర్యరశ్మి కారణంగా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. కీరాదోసలో ఉండే వాటర్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: కింగ్ కోబ్రా vs రస్సెల్ వైపర్.. ఏది ఎక్కువ విషపూరితమంటే..
ఆక్సీకరణ ఒత్తిడి..
దోసకాయ జ్యూస్ శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయలో ఉండే నీటి శాతం, ఫైబర్ కంటెంట్, పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
రక్తపోటు..
రక్తపోటు అధికంగా ఉన్నవారు దోసకాయ జ్యూస్ ను తీసుకోవడం చాలా మంచిది. దోసకాయలో పొటాషియం అధికమొత్తంలో ఉంటుంది. దీనివల్ల దోసకాయ జ్యూస్ తాగితే శరీరానికి పొటాషియం ఎక్కువ లభించి రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Figs: వేసవిలో అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యమేనా? వైద్యులు చెప్పిన నిజాలివీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 28 , 2024 | 02:15 PM