ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: అత్తారింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు.. మేళతాళాలతో నేపాల్ నుంచి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:57 AM

అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న సమయంలో.. దశరథ రాముడికి వివిధ ప్రాంతాల నుంచి

అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న సమయంలో.. దశరథ రాముడికి వివిధ ప్రాంతాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా అత్తగారింటి నుంచి వస్తున్న కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ జన్మించినట్లు చెప్పుకునే నేపాల్ లోని జనక్ పుర్ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. రాముడికి ఎన్నో బంగారు, వెండి కానుకలు, ఆభరణాలు తీసుకొచ్చారు. సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో వచ్చారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తామెంతో సంతోషంగా ఉన్నట్లు జనక్ పుర్ ఆలయ పూజారి అన్నారు. త్రేతాయుగంలో రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగిందని గుర్తు చేసుకున్నారు.

భక్తులు తీసుకువచ్చిన కానుకలలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు స్వీట్స్, ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్‌ ఉన్నాయి. కానుకల్లో వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, పట్టు వస్త్రాలు ముఖ్యమైనవి. సీతారాముల వివాహ సమయంలో జనకుడు ఎన్నో కానుకలు ఇచ్చాడని, తామూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు నేపాలీ భక్తులు.


మరోవైపు.. బనారస్ చీరలపై అయోధ్య రామ మందిర చిత్రాలు ముదించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దీంతో కార్మికులకు చేతి నిండా పని జరుగుతోంది. అంతే కాకుండా ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజునే తమకు డెలివరీ చేయాలని పలువురు గర్భిణీలు వైద్యులను కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 10:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising