ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Drinking Beer: బీర్ వదిలి ఉండలేకపోతున్నారా.. తాగితే ఇంత డేంజరా.. ఎవరెంత తాగాలి?

ABN, Publish Date - May 09 , 2024 | 01:05 PM

బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: పార్టీలైనా, పండగలైనా సందర్భం ఏదైనా బీరు పొంగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే బేవరేజెస్‌లో బీర్(Beers) నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి.

అయితే బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • అప్పుడప్పుడూ బీర్ తాగడం మంచిదేనంటున్నారు డాక్టర్లు. అలాగని రోజూ అదేపనిగా తాగుతుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు తప్పవట.

  • అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం.. రోజూ బీర్ తాగితే బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల ఊబకాయం తదితర సమస్యలు వేధిస్తుంటాయి.

  • ఎక్కువగా బీర్ తాగడం కాలేయం చెడి పోవడానికి కారణమవుతుంది. రోజూ తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు అంటే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఆల్కహాలిక్ హెపటైటిస్, కాలేయ వాపు వంటి వ్యాధులు వచ్చి.. చివరికి లివర్ పాడయ్యేలా చేస్తుంది.

  • బీరు అధికంగా తాగితే గుండె జబ్బులు వెంటాడతాయి. యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం.. రోజూ బీర్ తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇవి హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తుంది.


  • అతిగా ఏది తీసుకున్నా ప్రమాదమే. అలాగే నిత్యం బీరు తాగితే కంటి నిండా నిద్ర కరవవుతుంది. క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ ప్రకారం.. రాత్రి నిద్ర పోయే ముందు బీర్ తాగితే సరిగ్గా నిద్ర పట్టదు. నిద్రకు పూర్తిగా అంతరాయం కలుగుతుంది.

  • బీర్ రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. అతిగా బీర్ తీసుకుంటే లివర్, ఛాతి, పెద్ద పేగు, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉండే ఎథనాల్ అనే పదార్థం మనిషి డీఎన్ఏను పాడు చేసి.. క్యాన్సర్ త్వరగా రావడానికి కారణమవుతుంది.


మరి ఎంత తాగాలి..

బీర్ ఎంత తాగాలనేది మనిషి శరీర స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పురుషులు రెండు జగ్గుల బీరు తాగొచ్చు.. మహిళలైతే ఒక్క జగ్గు బీరుతో ఆపేయడం బెటర్. వయస్సు, బరువు, ఆరోగ్య స్థితి, జెండర్ ఇవన్నీ బీర్ తాగే లిమిట్‌ని నిర్ణయిస్తాయి. కాబట్టి హద్దులు దాటి బీరు తాగకపోవడం చాలా మంచిది. లేదంటే ఆసుపత్రిలకు క్యూ కట్టాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

Lok Sabha Polls: స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?

Read Latest News and Health News click here..

Updated Date - May 09 , 2024 | 01:05 PM

Advertising
Advertising