ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Milk: పాలు ఎక్కువగా తాగేస్తున్నారా.. ఆ అవయవానికి పొంచి ఉన్న ప్రమాదం

ABN, Publish Date - May 05 , 2024 | 12:10 PM

పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఎక్కువ పాలు(Milk) తాగడం వల్ల శరీరంలో హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది. పాలలో చాలా శాతం కొవ్వు, కేలరీలు ఉంటాయి. ఇవి శరీర బరువును వేగంగా పెంచుతాయి. 1 కప్పు పాలలో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. లాక్టోస్‌ కలిగి ఉంటుంది. ఈ కారణంగా బరువు పెరగడమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోజులో ఎంత పాలు తాగాలి?

  • పాలు తాగే సామర్థ్యం వ్యక్తి శారీరక స్థితి, వయస్సు ప్రకారం మారవచ్చు.

  • 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు - 300 - 500 ml పాలు

  • 4 నుండి 10 సంవత్సరాల వయస్సు గల వారు - 400 - 600 ml

  • 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు - 500 ml - 700 ml

  • 18 ఏళ్లు పైబడిన వారు - 1 - 2 గ్లాసుల పాలు తాగాలి

Milk Benefits: పాలు ఏ సమయంలో తాగితే అధిక ప్రయోజనం ఉంటుంది? తప్పక తెలుసుకోండి..!


దుష్ప్రభావాలు..

పొట్ట సంబంధిత సమస్యలు: అతిగాపాలు తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు. గ్యాస్, అతిసారం లేదా మలబద్ధకం వంటివి వేధిస్తుంటాయి. మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణక్రియ: పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ఉండే లాక్టోస్ వల్ల జీర్ణశక్తి దెబ్బతింటుంది.

చర్మ సమస్యలు: మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉంటే పాలు తాగకూడదు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పాలు తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ అలర్జీలు పెరుగుతాయి. మొటిమలు, దద్దుర్లు ఏర్పడతాయి.

కాలేయ సంబంధిత సమస్యలు: కాలేయ సంబంధిత వ్యాధులు ఉంటే పాలు అతిగా తాగకూడదు. పాలలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కాలేయం పాలను సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతుంది. దీని కారణంగా కాలేయ వాపు వస్తుంది.

For Latest News and Health News click here

Updated Date - May 05 , 2024 | 12:10 PM

Advertising
Advertising