ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ear Itching: చెవుల్లో దురదగా ఉంటుందా? ఈ టిప్స్ తో వెంటనే తగ్గిపోతుంది..!

ABN, Publish Date - Jul 02 , 2024 | 05:10 PM

చాలామంది తరచుగా చెవుల్లో దురద సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా దురద రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చెవులలో అధిక తేమ కారణంగా కూడా దురద వస్తుంది. అయితే..

చాలామంది తరచుగా చెవుల్లో దురద సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా దురద రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చెవులలో అధిక తేమ కారణంగా కూడా దురద వస్తుంది. చాలావరకు స్నానం చేసేటప్పుడు చెవులలోకి నీరు వెళుతూ ఉంటుంది. స్నానం చేసిన తరువాత చెవులను సరిగా శుభ్రం చేసుకోకపోతే దురద సమస్య వస్తుంది. కొన్నిసార్లు చలి కారణంగా కూడా చెవులలో దురద వస్తుంది. చెవుల లోపలి భాగాలలో మెత్తని పదార్థం చేరుతూ ఉంటుంది. ఇది పేరుకుపోవడం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. చెవుల్లో దురద తగ్గించుకోవడానికి కింది చిట్కాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.

Sri Lanka Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ శ్రీలంక ఆయిల్ వాడాల్సిందే.. దీన్నెలా తయారుచెయ్యాలంటే..!



ఆవాలనూనె..

ఆవాల నూనెను చెవులలో వేయడం వల్ల చెవిలో గలిమి మెత్తగా మారుతుంది. ఇది శుభ్రం చేయడానికి అనువుగా ఉంటుంది. పైగా ఆవనూనె వేడి స్వభావం కలిగి ఉంటుంది. చలికారణంగా వచ్చే దురదలు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

నిమ్మ, వేప..

నిమ్మరసం, వేపరసాన్ని సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక చుక్క చెవుల్లో వేస్తే చెవులలో దురద నుండి ఉపశమనం ఉంటుంది.

Glowing Skin: మెరిసే చర్మం కావాలంటే ఈ 5 విటమిన్లు తీసుకోండి చాలు..!



నెయ్యి, వెల్లుల్లి..

వెల్లుల్లిరెబ్బను నెయ్యిలో వేసి వేడి చేయాలి. ఇది చల్లారగానే చెవులో వేయాలి. వెల్లుల్లిని చెవి సమస్యలకు ఎన్నో ఏళ్ల నుండి వాడుతున్నారు.

పుదీనా నూనె..

పుదీనా నూనె లేదా మింట్ ఆయిల్ మంచి సువాసన కలిగిన నూనె. దీన్ని అరోమా థెరపీలో ఉపయోగిస్తారు. పుదీనా నూనె దురద పెడుతున్న చెవులకు చల్లదనాన్ని ఇస్తుంది. దురదను తగ్గిస్తుంది.

పైన చెప్పుకున్న చిట్కాలు పాటించినప్పటికీ చెవులలో దురద తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!

కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 02 , 2024 | 05:10 PM

Advertising
Advertising