Brain Tumor: ఈ సంకేతాలు కనిపిస్తే మెదడులో కణితులు ఉన్నట్టే!
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:04 PM
మెదడులో తలెత్తే కణితులతో ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సమస్యలుగా కనిపించే వీటి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్యం ముదిరే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మెదడులో తలెత్తే కణితులతో ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సమస్యలుగా కనిపించే వీటి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్యం ముదిరే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాధారణ ఇబ్బందిగా కనిపించే తలనొప్పి వెనక మెదడులో కణితి కారణం కావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. వైద్యులు చెప్పే దాని ప్రకారం, శరీరంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
Viral: జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతున్నారా? అయితే..
తలనొప్పి
మెదడులో కణితి ఉన్నప్పుడు నిత్యం తలనొప్పి వేధించవచ్చు. కొన్ని సార్లు తీవ్రంగా తలనొప్పి వచ్చి పోవచ్చు. లేదా అప్పుడప్పుడూ ఓ మాదిరి తలనొప్పి వచ్చి పోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొందరిలో ఉదయం పూట కూడా తలనొప్పి కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఫిట్స్
మెదడులో విద్యుత్ సంకేతాల్లో మార్పులు వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి. కిందపడి అసంకల్పితంగా కాళ్లూ చేతులు ఆడిస్తారు. దీనికి ఎపిలెప్సీతో పాటు మెదడులో కణితి కూడా కారణం అయి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో తక్షణం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
కణితుల కారణంగా కొన్ని సార్లు కంటి చూపులో కూడా మార్పులు వస్తాయి. కణితి కారణంగా మెదడులో ఒత్తిడి పెరిగి దాని ప్రభావం కంటిచూపునకు కారణమయ్యే ఆప్టిక్ నాడిపై పడుతుంది. దీంతో, కంటికి ఓపక్కగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొందరికి వస్తువుల రెండుగా కనిపించే డైప్లోపియా కూడా వస్తుందని అంటున్నారు.
Indoor Pollution: ఎక్కువ సేపు వంటగదిలో గడుపుతున్నారా? ఎంతటి రిస్కో తెలిస్తే..
మెదడులో కణితుల కారణంగా కొందరిలో వినికిడి శక్తి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. చిన్నపిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆడియోమెట్రీ , ఇమేజింగ్ టెస్టులతో అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది.
అయితే, మెదుడలో కణితి తలెత్తిన ప్రతిసారీ మేధోశక్తిపై ప్రభావం పడుతుందని భావించొద్దని వైద్యులు చెబుతున్నారు. ఆలోచన, జ్ఞాపశక్తిలో మార్పులు లేకపోయినా కణితి పెద్దదై చివర్లో సమస్యలు తెచ్చిపెట్టొచ్చట. మెదడులో తలెత్తే కణితులన్నీ క్యాన్సర్ కణితులు కూడా కావని చెబుతున్నారు. ఇక కొన్ని రకాల క్యాన్సర్లు మాత్రమే వారసత్వంగా సంక్రమిస్తాయి. వృద్ధుల్లో క్యాన్సర్ ఎక్కువన్న భావన కూడా సరికాదు. ఇక సెల్‌ఫోన్ అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందనేందుకు కూడా శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారాలు లేవు.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!
Updated Date - Dec 21 , 2024 | 11:11 PM