ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Winter Health: చలికాలంలో నారింజ పండ్లు తింటే ఏం జరుగుతుందంటే..!

ABN, Publish Date - Jan 11 , 2024 | 04:04 PM

చలికాలంలో నారింజలు అందుబాటులో ఉంటాయి. చలికాలంలో నారింజ తినడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే సమస్య ఉంటుందని అనుకుంటారు. నారింజ పండ్లను వింటర్‌లో తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో నారింజలు (Orange) అందుబాటులో ఉంటాయి. తొక్క తీసుకుని తొనలుగా తింటారు. పండ్లతో జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. చలికాలంలో నారింజ తినడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే సమస్య ఉంటుందని అనుకుంటారు. నారింజ (Orange) పండ్లను వింటర్‌లో తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్‌ కంటే పండ్లను తినడం వల్ల అధిక ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు.

నారింజలో ఉండే బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇందులోని ఫైబర్‌ కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, శరీర బరువును నియంత్రిస్తాయి. కంటి సమస్యలు సులభంగా దూరం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది నారింజలను ఎక్కువగా తీసుకుంటారు.

నారింజలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి రోజు ఉదయం, రాత్రి కూడా నారింజ జ్యూస్‌ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. భోజనానికి ముందు తీసుకోవడంతో గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలు, పెరుగు తీసుకున్న తర్వాత వీటిని తీసుకోవద్దని నిపుణులు వివరించారు.

నోట్: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 04:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising