Facial Hair: ఫేషియల్ హెయిర్ సులువుగా ఇంట్లోనే తొలగించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ABN, Publish Date - Oct 07 , 2024 | 01:12 PM
అవాంచిత రోమాలు తొలగించుకోవాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే ఈ టిప్స్ పాటిస్తే సరి.
ఫేషియల్ హెయిర్ ముఖం మీద పెరిగే అవాంఛిత రోమాలు. ముఖ్యంగా పై పెదవి పైన వచ్చే హెయిర్ అమ్మాయిల అందాన్ని పాడుచేస్తుంది. చాలామంది ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ కు వెళుతుంటారు. అయితే ఇంటిపట్టునే ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని టిప్స్ చాలా బాగా సహాయపడతాయి. వీటితో నొప్పి లేకుండానే ఫేషియల్ హెయిర్ తొలగుతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
Sweet Potatoes: చిలకడదుంప అంటే మీకు ఇష్టమా? దీన్ని తింటే యవ్వనంగా ఉండొచ్చా?
శనగపిండి..
ముఖం మీద అవాంఛిత రోమాలు తొలగించడంలో శనగపిండి బాగా సహాయపడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు..
శనగపిండి.. 2 టేబుల్ స్పూన్లు
పసుపు పొడి.. 1 టేబుల్ స్పూన్
పాలు లేదా పెరుగు.. 2 టేబుల్ స్పూన్లు
తేనె.. 1 టీ స్పూన్
నిమ్మరసం.. అర టీస్పూన్.
తయారీ విధానం..
పై పదార్థాలు అన్నీ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మీద.. ముఖ్యంగా రోమాలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎక్కువగా రాయాలి. దీన్ని 20 నుండి 25 నిమిషాలు అలాగే ఉంచాలి.
శనగపిండి పేస్ట్ ముఖం మీద ఆరిపోయాక తడి టవల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తుంటే ఫేషియల్ హెయిర్ పూర్తీగా తొలగిపోతుంది.
Hair Growth: ఇంట్లోనే ఈ 3 రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
పసుపు, చక్కెర, కొబ్బరి నూనె..
అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఇది కూడా చాలా ప్రభావవంతమైన చిట్కా. దీనికి కావలసిన పదార్థాలు..
పాలు..
పసుపు..
కొబ్బరి నూనె..
గోధుమ పిండి..
చక్కెర..
శనగపిండి..
తయారీ విధానం..
గ్యాస్ స్టవ్ మీద పాలను పెట్టి వేడి చేయాలి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా పంచదార వేసి ఉడికించాలి. అందులో ఒక స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూన్ శనగపిండి వేసి పేస్ట్ అయ్యేలా ఉడికించాలి.
ఇది కాస్త చల్లారిన తరువాత దీన్ని ముఖానికి పట్టించాలి.
15 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయాలి.
ఆరిపోయిన తరువాత ముఖాన్ని కొద్దిగా తడిపి చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖానికి ఉన్న ప్యాక్ ను తొలగించాలి. తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ చిట్కా ఫాలో అయితే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి..
White Hair: బీట్రూట్ జ్యూస్ తో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 07 , 2024 | 01:12 PM