Fatty Liver: చలికాలంలో చేసే ఈ పొరపాట్ల వల్ల కాలేయానికి ఎంత నష్టమో తెలుసా..?
ABN, Publish Date - Jan 02 , 2024 | 11:24 AM
చలికాలంలో చాలామంది చేసే ఈ పనుల కారణంగా ఈ కాలేయం దెబ్బతిని శరీరనికి పెద్ద నష్టం చేకూరుతుంది.
చలికాలాన్ని రోగాల కాలం అని కూడా పిలుస్తారు. సీజనల్ సమస్యలు మాత్రమే కాకుండా చాలామంది ఈ కాలంలో చేసే కొన్ని తప్పిదాల కారణంగా పెద్ద సమస్యలు వస్తాయి. శరీరంలో కాలేయం ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. శరీరాన్ని శుద్ది చేసే పని కాలేయానిదే. కానీ చలికాలంలో చాలామంది చేసే పనుల కారణంగా ఈ కాలేయం దెబ్బతిని శరీరనికి పెద్ద నష్టం చేకూరుతుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు సులువుగా పేరుకునిపోయే కాలమిది. ఫ్యాటీ లివర్ అని పిలుచుకునే ఈ సమస్యకు కారణమవుతున్న అలవాట్ల గురించి పూర్తీగా తెలుసుకుంటే..
చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది కాఫీలు, టీలు, బేకరీ ఆహారాలు, నూనెలో వేయించిన పకోడాలు, వేరుశనగ, మైదా, చీజ్, వెన్న ఆధారిత ఆహారాలు చాలా తింటారు. ఈ ఆహారాలలో అధికశాతం కొవ్వు ఉంటుంది. ఇది కాలేయంలో పేరుకుని పోతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యకు, లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: ఓ మై గాడ్.. లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!
చలికాలంలో చాలామంది ఇంటి నుండి బయటకు రావడానికి బద్దకిస్తారు. వ్యాయామం, వాకింగ్ లాంటివి చెయ్యకుండా పోస్ట్ పోన్ చేస్తారు. దీని కారణంగా శరీరంలో చురుకుదనం తగ్గిపోయి రక్తంలో చక్కెర స్థాయిలు పేరుకుపోతాయి. ఈ కారణంగా మధుమేహం సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా స్వీట్లు, కేకులు, చాక్లెట్లు పెద్ద మొత్తంలో తింటారు. చాలామంది ఈ వేడుక సందర్భంగా వచ్చిన చాక్లెట్లను జనవరి నెల మొత్తం తింటుంటారు. దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక వేసవి కాలంలో పోలిస్తే చలికాలంలో నీరు తీసుకోవడం చాలా తక్కువ. శరీరంలో నీటి శాతం తక్కువ, చక్కెర శాతం ఎక్కువ ఉండటం మూలాన కూడా కాలేయం దెబ్బతింటుంది. శుద్ది చేసిన చక్కెర, అదిక ఫ్రక్టోజ్ కలిసి కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు తమ పిల్లల గురించి టీచర్లను తప్పక అడగాల్సిన ప్రశ్నలివి..!
ఫ్యాటీ లివర్ రాకూడదంటే ఈ పనులు చేయాలి..
వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తాయి. అందుకే వీటిని తినడం మానుకోవాలి.
తాజా పండ్లను, కాలేయాన్ని శుద్దిచేసే ఆహారాలు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేసుకుంటూ ఉండాలి.
రోజూ వ్యాయామం చెయ్యడం మంచిది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల కదలిక మెరుగ్గా ఉంటుంది. బరువు పెరగకుండా చేస్తుంది.ఫ్యాటీ లివర్ సమస్య రాకూడదంటే రోజూ 30నిమిషాలు నడవాలి.
చక్కెర, సోడా, కేకులు, స్వీట్లు, బేకరీ ఆహారాలు, మైదా ఆహారాలు, నూనె పదార్థాలు, డీప్ ఫ్రై ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. చలికాలం అయినా సరే నీరు సరిపడినంత తీసుకోవాలి. కుదిరితే గోరువెచ్చని నీరు తాగాలి.
ఇది కూడా చదవండి: పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలు చోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 02 , 2024 | 11:24 AM