AGE Compounds: భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్.. ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో వెల్లడి
ABN, Publish Date - Oct 07 , 2024 | 09:11 AM
భారతీయులు అధిక సంఖ్యలో డయాబెటిస్ బారినపడటానికి కారణమవుతున్న ఆహారపదార్థాలపై తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే విధానం కారణంగా ఫుడ్స్‌లో ఏజీఈ అనే రసాయనాలు తయారవుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇవి డయాబెటిస్‌కు దారి తీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు అధిక సంఖ్యలో డయాబెటిస్ బారినపడటానికి కారణమవుతున్న ఆహారపదార్థాలపై తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది. భారత వైద్య పరిశోధన మండలి, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే విధానం కారణంగా ఫుడ్స్‌లో ఏజీఈ అనే రసాయనాలు తయారవుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇవి డయాబెటిస్‌కు దారి తీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు (Health).
Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!
ఏమిటీ ఏజీఈ రసాయనాలు?
ఏజీఈ అంటే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ అని అర్థం. ఎంజైమ్‌ల పాత్ర లేకుండానే ఇవి ఏర్పడతాయి. ఫుడ్స్‌లో ఉండే ప్రొటీన్లు, కొవ్వులకు చక్కెరలు జత కూడినప్పుడు ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేక్స్, కుకీలు, వేయించిన వంటకాలు, మెయోనీస్, మార్గరీన్‌తో పాటు మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయట. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఏజీఈ కాంపౌండ్లు దీర్ఘకాలంలో షుగర్ వ్యాధి తలెత్తేలా చేస్తాయి. నిప్పులపై వేయించిన లేదా బాగా నూనె వేసి వేయించిన ఆహారాలు, ఇతర ప్రాసెస్డ్ పదార్థాల్లో ఇవి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవిరిపై ఉడకపెట్టిన ఆహారాల్లో ఏజీఈలు తక్కువగా ఉంటాయని తేల్చారు.
Obesity: పురుషులకు అలర్ట్! ఊబకాయంతో టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గుదల!
ఏజీఈ రసాయనాల ఎఫెక్ట్ ఇదీ..
ఏజీఈ రసాయనాలు అధికంగా ఉన్న ఆహారాలు తింటే ఇన్సులీన్ సెస్సిటివీ తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని కణాలు ఇన్సులీన్‌కు ఎంత వేగంగా స్పందిస్తున్నయేదానికి కొలమానం ఇన్సులీన్ సెన్సిటివిటీ. ఇన్సులీన్‌కు కణాలు సరిగా స్పందించకపోతే అవి రక్తంలోని చక్కెరలను వినియోగించుకోలేవు. ఫలితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఏజీఈ కాంపౌండ్లు తక్కువ ఉన్న వారిలో ఇన్సులీన్ సెన్సిటివిటీ మెరుగుపడినట్టు, రక్తంలో చక్కెరల స్థాయిలు అదుపులో ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.
ప్రెగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆవిరిపై ఉడికించడం లేదా నీళ్లల్లో మరగబెట్టి చేసే వంటకాల్లో ఏజీఈ రసాయనాలు తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. వేపుళ్లు, నిప్పులపై వేడి చేసిన ఫుడ్స్‌లో ఈ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి, ఫుడ్స్‌తో పాటు అవి తయారు చేసే విధానం కూడా ఏఈజీ కాంపౌండ్ల స్థాయిని పెంచుతాయి. వీటి వల్ల ఆక్సిడేటివ్ స్టెస్ పెరిగి చివరకు ఇన్‌ఫ్లమేషన్ మొదలవుతుంది. అంతిమంగా ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఇక ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యుట్రీషన్‌లో ప్రచురితమయ్యాయి.
Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
Updated Date - Oct 07 , 2024 | 09:15 AM