Food Hacks: స్టఫ్డ్ పరోటాలు రుచిగా ఫర్పెక్ట్ గా రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
ABN, Publish Date - Nov 08 , 2024 | 05:28 PM
భారతీయులు చపాతీ, పరోటా వంటి ఆహారాలను ఇష్టంగా తింటారు. అయితే వీటిని తయారు చేయడానికి కొందరు ఇబ్బంది పడతారు. ఈ సింపుల్ టిప్స్ తో ఎవరైనా పర్పెక్ట్ పరోటాలు తయారు చేయవచ్చు.
పరోటా.. చపాతీకి అప్డేట్ వెర్షన్ అనుకోవచ్చు. పరోటాలను గోధుమ పిండితోనూ, మైదా పిండితోనూ తయారు చేస్తుంటారు. ఆరోగ్యకరమైన పరోటాల కోసం గోధుమ పిండే మంచి ఎంపిక. దక్షిణాది రాష్ట్రాలలో రోటిలు, పరోటాలు చేయడం తక్కువ. కానీ పెద్ద పట్టణాలలో, నగరాలలో బయటి ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు పరోటా, చోలే బతూరా వంటి ఆహారాలు తినడానికి మొగ్గు చూపుతారు. ముఖ్యంగా స్టఫ్డ్ పరోటా అంటే కొందరికి పిచ్చి ఇష్టం ఉంటుంది. కానీ వీటిని ఇంట్లో చేయడం కష్టం. స్టఫ్ లోపలి నుండి బయటకు రావడం, పరోటాలు ఒత్తేటప్పుడు పీటకు అతుక్కుపోవడం, కాల్చేటప్పుడు స్టప్ బయటకు వచ్చేయడం జరుగుతుంది. అయితే ఇంట్లోనే ఈజీగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ స్టప్డ్ పరోటాలను చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇందుకోసం పాటించాల్సిన టిప్స్ ఏంటో చూస్తే..
పిండి..
పరోటాలను చేయడానికి ఏ పిండిని ఎంచుకున్నా సరే.. ఆ పిండిని మెత్తగా పిసికి కలపాలి. ఇలా పిండిని కలుపుతున్నప్పుడు అందులో నూనె కూడా కొంచెం వేయాలి. నూనె వేసి పిండిని బాగా పిసికితే ఆ పిండి బాగా మృదువుగా మారుతుంది.
నానబెట్టాలి..
పిండిని కలిపిన తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేసి నానబెట్టాలి. ఇలా చేస్తే పిండిలో గ్లూటెన్ ఏర్పడుతుంది. ఇది పిండి మృదువుగా మారడంలో సహాయపడుతుంది. కనీసం 30 నిమిషాలు నానిన తరువాత పిండిని ఉపయోగిస్తే పిండి పరోటాలు చేయడానికి బాగా సూట్ అవుతుంది.
స్టఫింగ్..
పరోటాలు చేయడానికి ఉపయోగించే స్టఫింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టఫింగ్ ఎప్పుడూ వేడిగా ఉండకూడదు. స్ఠఫింగ్ కోసం చేసిన పదార్థం చల్లారే వరకు పరోతాలు చేయకూడదు. స్టఫింగ్ కోసం ఉపయోగించే పదార్థం వీలైనంత వరకు పొడిగా లేకుండా చూసుకోవాలి.
ఎక్కువ వద్దు..
పరోటాలు తయారు చేయడానికి పిండిలో స్ఠఫింగ్ నింపేటప్పుడు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పిండిలో స్ఠఫింగ్ ను ఎక్కువగా నింపకూడదు. పైగా స్టఫింగ్ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే స్టఫ్ చేయాలి.
ఎక్కువ ఒత్తిడి వద్దు..
పరోటాలు వత్తేటప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉపయోగించకూడదు. వాటిని సున్నితంగా మెల్లగా ఒత్తుతూ వత్తుకోవాలి. ఇలా చేస్తే లోపలి మిశ్రమం బయటకు రాదు. అదే ఎక్కువ ఒత్తిడితో వత్తితే లోపలి మిశ్రమం చాలా వేగంగా బయటకు వచ్చి పరోటా మొత్తం చెడిపోతుంది.
Updated Date - Nov 08 , 2024 | 05:33 PM