ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Grape Fruit: పంపరపనస ఎప్పుడైనా తిన్నారా? దీనివల్ల కలిగే 5 బెనిఫిట్స్ ఇవే..!

ABN, Publish Date - Mar 02 , 2024 | 11:25 AM

చాలా కలర్ ఫుల్ గా ఉండే పంపరపనస కేవలం రుచిగా ఉండటమే కాదు.. తింటే ఈ ప్రయోజనాలు కూడా..

పంపర పనస అచ్చం బత్తాయిని పోలి, పెద్ద పరిమాణంలో ఉంటుంది. పండు లోపల నిమ్మ, నారింజ, బత్తాయిలాగా తొనలు ఉంటాయి. ఇది సిట్రస్ జాతికి చెందిన పండు. చూడ్డానికి చాలా కలర్ ఫుల్ గా ఉండే పంపరపనస కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది. పంపరపనస తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ లుక్కేస్తే..

రోగనిరోధకశక్తి..

విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల పంపరపనస రోగనిరోధకశక్తిని పెండంలో అద్బుతంగా సహాయపడుతుంది. రోజువారీ దీన్ని తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పరంగా గణణీయమైన ఫలితాలు ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరవు.

గుండె ఆరోగ్యం..

పంపరపనసలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. పొటాషియం రక్త స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సంబంధ సమస్యలు సహజగానే అదుపులో ఉంటాయి. ఇక ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు..

జీర్ణక్రియకు సహయపడే జీర్ణ ఎంజైమ్ లు పంపరపనసలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

బరువు..

పంపరపనస రుచిలో తియ్యగా ఉన్నప్పటికీ కేలరీలు తక్కువ ఉంటాయి. కొవ్వు త క్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తీపి తినాలనే వారికి ఇది తృప్తిని ఇస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు పంపరపనసను తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

చర్మ ఆరోగ్యం..

విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో పంపరపనస కీలకపాత్ర పోషిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 11:25 AM

Advertising
Advertising