ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Guava Vs Pregnancy women's: గర్భవతులు జామపండ్లు ఎందుకు తినాలి? డాక్టర్లు చెప్పిన నిజాలివీ..!

ABN, Publish Date - Jun 10 , 2024 | 01:58 PM

జామపండ్లను పేద వాడి యాపిల్ అని అంటారు. యాపిల్ పండ్లలో ఉండే పోషకాలలో చాలా వరకు జామ పండులో కూడా ఉంటాయి. జామ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఆకలి ఎక్కువసేపు నియంత్రణలో ఉంటుంది. అయితే గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా జామపండ్లు తినాలని అంటున్నారు.

జామపండ్లను పేద వాడి యాపిల్ అని అంటారు. యాపిల్ పండ్లలో ఉండే పోషకాలలో చాలా వరకు జామ పండులో కూడా ఉంటాయి. జామ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఆకలి ఎక్కువసేపు నియంత్రణలో ఉంటుంది. అయితే గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా జామపండ్లు తినాలని అంటున్నారు. గర్భవతులకు జామపండ్లు చేకూర్చే లాభాలేంటి? జామపండ్లు ఎంత మోతాదులో తినవచ్చు? తెలుసుకుంటే..

జామపండ్లలో విటమిన్-సి, విటమిన్-కె, విటమిన్-ఎ, విటమిన్-బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు రోజుకు 100 నుండి 150 గ్రాముల వరకు జామ పండ్లు తినవచ్చు. ఈ మోతాదులో జామపండ్లు తీసుకుంటే గర్బిణీల ఆరోగ్యం బాగుంటుంది.

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!


జామపండ్లలో విటమిన్-ఇ, సి, బి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తాయి. అందుకే గర్భవతులకు జామపండ్లు తినమని చెబుతారు.

ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు గర్భం దాల్చిన తరువాత మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చిన తరువాత మధుమేహం రాకూడదంటే జామపండ్లు తినడం సరైన మార్గమని ఆహార నిపుణులు అంటున్నారు.

జామపండ్లలో ఉండే నీటి శాతం శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గర్భవతులలో నీటిశాతం తగ్గకుండా చేయడంలో జామపండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

గర్భవతులకు ఐరన్ పుష్కలంగా అందండం చాలా ముఖ్యం. జామపండ్లలో ఐరన్ మంచి మొత్తంలో ఉంటుంది. ఐరన్ లోపాన్ని అధిగమించాలన్నా, శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉండాలన్నా జామపండ్లు తినాలి.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 01:58 PM

Advertising
Advertising