Hair Care: ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలడం ఆగడమే కాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..!
ABN, Publish Date - Aug 28 , 2024 | 03:34 PM
జుట్టు రాలడాన్ని ఆపుతూ మరొవైపు తెల్లగా మారుతున్న జుట్టు నల్లగా నిగనిగలాడించే నూనె ఉంది. దీన్ని ఆయుర్వేదం సిఫారసు చేస్తోంది. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ నూనె..
జుట్టు పెరగడానికి, తెల్లగా మారుతున్న జుట్టును తిరిగి నల్లగా చేసుకోవడానికి చాలా రకాల షాంపూలు, నూనెలు, హెయిర్ ప్యాక్ లు వాడుతుంటారు. చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలాంటి టిప్స్ ను చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే ఫలితం చాలా అరుదుగా ఉంటుంది. అటు జుట్టు రాలడాన్ని ఆపుతూ మరొవైపు తెల్లగా మారుతున్న జుట్టు నల్లగా నిగనిగలాడించే నూనె ఉంది. దీన్ని ఆయుర్వేదం సిఫారసు చేస్తోంది. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ నూనె గురించి తెలుసుకుంటే..
అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
జటామాన్సి ఆయిల్..
జటామాన్సి అనేది ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగించే ఒక మూలిక. దీంతో తయారు చేసిన నూనెను 30 రోజులు ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య ఆగిపోవడమే కాకుండా బూడిద రంగులోకి మారుతున్న జుట్టు క్రమంగా నలుపు రంగులోకి వస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో.. కావలసిన పదార్థాలేంటో తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
జటామాన్సి పొడి..
ఆముదం..
కొబ్బరి నూనె..
గాజు సీసా..
ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!
తయారీ విధానం..
ఒక గాజు సీసాలో జటామాన్సి పొడి, ఆముదం, కొబ్బరి నూనె వేయాలి. తరువాత గాజుసీసా ను గుడ్డతో కప్పి దాని మీద గాజు సీసా మూత బిగించాలి. ఈ గాజు సీసా ను 2-3 రోజులు ఎండలో ఉంచాలి. సీసా మూతను ఎట్టి పరిస్థితిలోనూ తెరవకూడదు. 2-3 రోజులు ఎండలో ఉంచిన తరువాత దాన్ని 5-7 రోజులు ఒక చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే జటామాన్సి ఆయిల్ సిద్దమైనట్టే.
ఎలా ఉపయోగించాలి..
ఈ నూనెను తలస్నానం చేయడానికి 30 నిమిషాల ముందు జుట్టుకు పెట్టుకుని సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఒక వేళ సమయం ఉంటే రాత్రి సమయంలో జుట్టుకు ఈ నూనె పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచి ఆ తరువాత ఉదయాన్నే తలస్నానం చేయాలి. 30 రోజులు దీన్ని ఉపయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి.
Uric Acid Vs Ghee: యూరిక్ యాసిడ్ పెరిగితే నెయ్యి తినవచ్చా? వైద్యులు ఏం చెప్పారంటే..!
ఇది ఎలా పనిచేస్తుంది?
జటామాన్సి ఆయిల్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ కారణంగా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే దీన్ని అప్లై చేయడం వల్ల వెంట్రుకలు జుట్టు కుదుళ్ల నుండి దృఢంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ నూనె మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సుకు హాయిని ఇస్తుంది.
ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!
పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 28 , 2024 | 03:34 PM