ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Growth: ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!

ABN, Publish Date - Oct 14 , 2024 | 08:41 PM

జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగితే వద్దనే వారు ఎవరూ ఉండరు. కానీ జుట్టు పెరగడం చాలామందికి కలగానే మిగిలిపోతుంది. ఇవి అలవాటు చేసుకుంటే మాత్రం జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.

Long Hair

జుట్టును కేశ సంపద అని పిలుస్తారు. జుట్టు ఎంత ఒత్తుగా ఆరోగ్యంగా ఉంటే అంత ధనవంతులం అన్నట్టు ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ కాలంలో జుట్టు పెరుగుదల పెద్ద సవాల్ గా మారింది. కానీ కొన్ని టిప్స్ పాలో అయితే చాలు జుట్టు అందంగా, ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుందట. ఇంతకీ జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే..

స్కాల్ప్ కేర్..

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తల చర్మం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా తల చర్మంలో రక్త ప్రసరణ బాగుండాలి. దీనికోసం స్కాల్ప్ కు రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే నూనెలను వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

Weight Loss: బరువు తగ్గాలంటే నీరు ఎలా తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివీ..!


హెయిర్ స్టైల్..

కొందరు అందంగా కనిపించడం కోసం పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతుంటారు. కానీ జుట్టును ఆరోగ్యంగా ఉంచే హెయిర్ స్టైల్స్ ను ఫాలో అయితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టును బిగించడం వంటి హెయిర్ స్టైల్స్ మాత్రమే కాదు.. జుట్టు చివర్లు చిట్లడానికి కారణమయ్యే హెయిర్ స్టైల్స్ కూడా అవాయిడ్ చెయ్యాలి.

దిండు కవర్లు..

దిండు కవర్లు కూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయా అంటే అవును అంటున్నారు. సిల్క్ తో తయారు చేసిన దిండు కవర్లు ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట. అలా కాకుండా రఫ్ గా గరుకుగా ఉన్న దిండు కవర్లు వాడితే జుట్టు దెబ్బతింటుంది.

హెయిర్ కట్..

హెయిర్ కట్ చేయడం అంటే జుట్టు పొడవుగా కట్ చేయడం కాదు.. జుట్టు చివర్లను ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి ట్రిమ్ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు చివర్లు చిట్లి ఉంటే ఈ ప్రక్రియ వల్ల అవి తొలగిపోతాయి. జుట్టు చివర్లు చిట్లితే జుట్టు పెరగదు.

Health Tips: పైల్స్ తో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే..!


హెయిర్ మాస్క్..

జుట్టుకు పోషణ ఇవ్వడానికి, డ్యామేజ్ అయిన జుట్టు రిపేర్ చేయడానికి హెయిర్ మాస్క్ లు బాగా సహాయపడతాయి. ఇవి జుట్టుకు కండిషనింగ్ చేస్తాయి. జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కనీసం వారానికి లేదా 10 రోజులకు ఒకసారి ఏదైనా ఆరోగ్యకరమైన హెయిర్ మాస్క్ పెట్టుకోవడం మంచిది.

వాష్..

జుట్టును కడిగే విధానం జుట్టును డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. తలస్నానం చేయడానికి రసాయనాలు లేని తేలికపాటి షాంపూని ఉపయోగించాలి. ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలస్నానం చేయడానికి గంట ముందు తలకు ఆయిల్ పెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి..

ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!

కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 14 , 2024 | 08:41 PM