ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Oil: ఈ 3 రకాల నూనెలు ఇంట్లోనే తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:17 PM

జుట్టు సంరక్షణ ఇప్పట్లో చాలా ఖరీదైనదిగా మారింది. హెయిర్ ఆయిల్, హెయిర్ సీరమ్, హెయిర్ షాంపూ, హెయిర్ కండీషనర్.. ఇవి మాత్రమే కాకుండా హెయిర్ స్ప్రేలు, హెయిర్ మాస్క్ లు కూడా అదనంగా ఉంటాయి. వీటికోసం మార్కెట్లో వందల నుండి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ..

Hair Oil

జుట్టు సంరక్షణ ఇప్పట్లో చాలా ఖరీదైనదిగా మారింది. హెయిర్ ఆయిల్, హెయిర్ సీరమ్, హెయిర్ షాంపూ, హెయిర్ కండీషనర్.. ఇవి మాత్రమే కాకుండా హెయిర్ స్ప్రేలు, హెయిర్ మాస్క్ లు కూడా అదనంగా ఉంటాయి. వీటికోసం మార్కెట్లో వందల నుండి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇంత ఖర్చు చేసినా జుట్టు పెరుగుదలలో కానీ జుట్టు ఆరోగ్యంలో కానీ మరీ అంత మెరుగుదల ఏమీ ఉండదు. అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే మూదు రకాల నూనెలు ఉన్నాయి. ఈ నూనెలను వాడితే జుట్టు ఊహించని విధంగా పెరుగుతుంది. ఇంతకీ ఆ నూనెలు ఏంటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

Health Tips: జీడిపప్పు, బాదం కంటే శక్తివంతమైన డ్రై నట్ గురించి తెలుసా?


కరివేపాకు నూనె..

కరివేపాకు జుట్టుకు మ్యాజిక్ చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టును డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. ఒక గిన్నెలో స్వచ్చమైన కొబ్బరినూనె పోసి అందులో కొన్ని కరివేపాకులు వేయాలి. కరివేపాకు బాగా ఉడికి, నల్లగా మారిన తరువాత దించి చల్లారనివ్వాలి. ఆ తరువాత వడగట్టాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా వాడుతుంటే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. చిన్న వయసులోనే జుట్టు నెరవడాన్ని ఇది నివారిస్తుంది.

Health Tips: చాలా వేడిగా ఉన్న ఆహారం తింటున్నారా? ఈ నిజాలు తెలుసా?


మందార నూనె..

మందారంలో విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు, అమైనో ఆమ్లాలతో సహా పైబర్. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మందారంలో ఉండే గుణాలు స్కాల్ఫ్ ను తేమగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు పెరుగుదలలో ప్రభావవంతగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నూనెలో 10 వరకు మందార పువ్వులను పేస్ట్ చేసి ఆ ముద్దను వేసి సన్నని మంట మీద బాగా ఉడికించాలి. నూనె బాగా ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన నూనెను వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. తలస్నానం చేయడానికి అరగంట నుండి గంట ముందు ఈ నూనెను తలకు అప్లై చేయాలి. తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు మెరుస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది. చిన్నవయసులోనే జుట్టు నెరవకుండా చేస్తుంది.

గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?


మెంతి నూనె..

మెంతులు జుట్టు పెరుగుదలలో ప్రభావవంతంగా ఉంటాయి. మెంతి గింజలలో యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో మెంతి గింజలు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఉడికిన తరువాత స్టౌ ఆప్ చేయాలి. నూనె చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు జుట్టుకు రాసుకోవచ్చు. జుట్టు పెరుగుదల బాగుటుంది. జుట్టు నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి..

నానబెట్టిన ఎండుద్రాక్షను నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!

రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 16 , 2024 | 05:38 PM

Advertising
Advertising