ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Headache: వ్యాయామం తర్వాత మీకు తలనొప్పిగా ఉంటుందా? అసలు కారణాలు ఇవే..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 10:02 AM

సాధారణంగా వ్యాయామం చేసే సమయంలో శ్వాస వేగం పెరగడం, చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం వ్యాయామం తరువాత తీవ్రమైన తలనొప్పి అనుభవిస్తుంటారు.

ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా చాలా మంది యోగా,వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి సారిస్తున్నారు. సాధారణంగా వ్యాయామం చేసే సమయంలో శ్వాస వేగం పెరగడం, చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం వ్యాయామం తరువాత తీవ్రమైన తలనొప్పి అనుభవిస్తుంటారు. అసలు వ్యాయామం తరువాత తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలు ఏంటి? వైద్యులు చెప్పిన విషయాలు తెలుసుకుంటే..

ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!


ఆక్సిజన్..

చాలాసార్లు ఎక్కువ పని చేసినప్పుడు శరీరానికి ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది. మెదడుకు ఆక్సిజన్ తగినంత సరఫరా కాకపోతే తలనొప్పి వస్తుంది. వ్యాయామానికి కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే వ్యాయామం చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు శ్వాస నియమాలు పాటించాలని చెబుతారు. వేగంగా వ్యాయామం చెయ్యాలనే ఆత్రుత తో శ్వాస తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే తలనొప్పి వస్తుంది.

రక్తపోటు..

వ్యాయామం చేస్తున్నప్పుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తప్రవాహం పెరుగుతుంది. రక్తప్రవాహంలో అకస్మాత్తుగా పెరుగుదల రావడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది.

నిర్జలీకరణం..

వ్యాయామం చేసేటప్పుడు చెమటలు బాగా పడతాయి. శరీరం నీరు కోల్పోతుంది. దీని వల్ల తలనొప్పి వస్తుంది. వ్యాయామం సమయంలో అధికంగా చెమట పడుతూ ఉంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!


నిద్రలేమి..

శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది. దీంతో శరీరం ఎప్పుడూ అలసటగా ఉంటుంది. జిమ్ లో వర్కౌట్లు లేదా వ్యాయామాలు చేసేవారు నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తక్కువ చక్కెర స్థాయిలు..

వ్యాయామాలు చేసేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల హైపోగ్లైసీమియా సంభవించవచ్చు. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది.

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 18 , 2024 | 10:02 AM

Advertising
Advertising
<