ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABC Juice: ఈ మూడు కలిపి తాగితే ఎప్పటికీ నవయువకుల్లా చెలరేగిపోతారు..

ABN, Publish Date - Oct 31 , 2024 | 06:03 PM

ఆరోగ్యంగా ఉండటానికి పండ్ల రసాలు, వివిధ రకాల జ్యూస్‌లను తాగుతారు. పండ్ల రసాలకంటే కొన్ని రకాల జ్యూస్‌లతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. వీటిలో ఏబీసీ జ్యూస్ ఒకటి. ఏబీసీ జ్యూస్ అంటే అదేదో కొత్తరకం అనుకోకండి. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని ..

ABC Juice

ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తులు తాము తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా నూనె, కొవ్వు ఎక్కువుగా లేని పదార్థాలను తీసుకుంటారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి పండ్ల రసాలు, వివిధ రకాల జ్యూస్‌లను తాగుతారు. పండ్ల రసాలకంటే కొన్ని రకాల జ్యూస్‌లతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. వీటిలో ఏబీసీ జ్యూస్ ఒకటి. ఏబీసీ జ్యూస్ అంటే అదేదో కొత్తరకం అనుకోకండి. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని ఏబీసీ జ్యూస్‌గా పిలుస్తారు. ఈ మూడింటిని కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా వివిధ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో తయారుచేసే జ్యూస్‌లలో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. పండ్లు, కూరగాయలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఓ మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు తోత్పడతాయి. ఏబీసీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


పండ్లు, కూరగాయలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలగకుండా, అనారోగ్యాలను దూరం చేస్తాయి. యాపిల్, క్యారెట్‌లోని పీచు కారణంగా శరీరంలోని జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీట్‌రూట్‌, క్యారెట్ క్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఆపిల్స్ హృదయనాళ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆఫిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్-ఇ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతో ఆపిల్స్ దోహదపడతాయి. బరువు తగ్గడానికి తోడ్పడతాయి. దుంప రకానికి చెందిన బీట్‌రూట్‌లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఫోలేట్ (విటమిన్ బి-9), ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్‌ను బీట్ రూట్స్ అందిస్తాయి. క్యారెట్‌లో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి. విటమిన్-ఎ, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, విటమిన్ కె పోషకలు క్యారెట్‌లో ఉంటాయి. ఈ మూడు రకాల పండ్లు, కూరగాయలను జ్యూస్‌గా చేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.


ప్రయోజనాలు

బరువు తగ్గాలనుకునేవారికి ఏబీసీ జ్యూస్ ఒక ఔషధంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఈ జ్యూస్ ఎంతో మంచిది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ జ్యూస్ తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఏబీసీ జ్యూస్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఏబీసీ జ్యూస్ తీసుకుంటే వయసు పెరుగుతున్నా నవ యువకుడిలా కనిపిస్తారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 31 , 2024 | 06:03 PM