Tea-biscuit: ఉదయాన్నే టీ బిస్కెట్ తింటే రిస్క్ అని తెలుసా?
ABN, Publish Date - Sep 22 , 2024 | 10:18 PM
ఉదాయన్నే టీ తోపాటు బిస్కెట్లు తినే వారు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉదాయన్నే టీ తోపాటు బిస్కెట్లు తినడం కొందరికి అలవాటు. కొందరు సాయంత్రం వేళల్లో చాయ్ బిస్కెట్లు తింటుంటారు. దాదాపుగా ప్రతిఒక్కరికీ ఈ అలవాటు ఉన్నప్పటికీ దీంతో చాలా మందికి తెలియని ప్రమాదం ఉందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. చాయ్ బిస్కెట్‌కు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని చెబుతున్నారు (Health).
Sleepmaxxing: స్లీప్‌మ్యాక్సింగ్ గురించి తెలుసా.. ఇలా చేస్తే రాత్రిళ్లు పర్‌ఫెక్ట్ నిద్ర!
చాయ్ బిస్కెట్‌తో సమస్యలు ఇవే..
ప్యాకెట్లలో ఉండే బిస్కెట్స్‌లో రిఫైన్డ్ చక్కెరలు అధికంగా ఉంటాయి. దీంతో, మధుమేహం, ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ల అసమతౌల్యత, అధిక బరువు తదితర సమస్యలు వచ్చిపడతాయి.
బిస్కెట్లను కూడా రిఫైన్డ్ మైదా పిండితో చేస్తారు. ఈ రకమైన పిండితో పేగుల్లోని హితకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలతో పాటు ఊబకాయం బారిన పడాల్సి వస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో అధిక భాగం పామ్ ఆయిల్ వాడతారు. దీంతో, అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. లిపిడ్ ప్రొఫైల్‌లో అసమతౌల్యత, ఇన్‌ఫ్లమేషన్, ఇన్సులీన్ వంటి సమస్యలు రావొచ్చు.
Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?
చాయ్ బిస్కె్ట్‌తో ఉన్న సమస్యల దృష్ట్యా ఇతర ఆరోగ్య ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని పోషకామార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర టీ, మెంతి టీ, పుదీనా టీ, సోంపు జతచేసిన టీ, తదితరాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
Updated Date - Sep 22 , 2024 | 10:18 PM