Health Tips: పైల్స్ తో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే..!
ABN, Publish Date - Oct 14 , 2024 | 07:12 PM
మొలల సమస్య గురించి చాలా మంది బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి సమస్యకు ఆయుర్వేద చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.
జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎలాంటి సంకోచం లేకుండా అందరికీ చెప్పుకుంటాం. ఓపిక తెచ్చుకుని మరీ వైద్యులను కలుస్తుంటాం. కానీ ఎవరికీ చెప్పుకోవడానికి ఇష్టపడని, వైద్యులను కలవాలన్నా సంకోచించే సమస్య పైల్స్. మలద్వారం దగ్గర ఎదురయ్యే ఈ సమస్య మనుషుల్ని కుర్చోనివ్వదు, నిల్చోనివ్వదు, నడవనివ్వదు.. కనీసం ఆహారం ప్రశాంతంగా తినాలన్నా తినలేరు. ఈ పైల్స్ సమస్యను తెలుగులో మొలలు అని పిలుస్తుంటారు. అసలు ఈ పైల్స్ సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్య తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలు ఏంటి? తెలుసుకుంటే..
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
మొలల ఆయుర్వేదంలో ఆర్శ అని పిలుస్తారు. ఆయుర్వేదం శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు ఉంటాయని చెబుతుంది. వీటిని త్రిదోషాలు అని అంటారు. ఈ త్రిదోషాలు కలుషితం అయితే శరీరం పనితీరు దెబ్బతింటుంది. త్రిదోషాలలో వాతం, కఫం ఎక్కువైతే డ్రై ఫైల్స్ సమస్య వస్తుంది. త్రిదోషాలలో ఒకటైన పిత్త దోషం ఎక్కువైతే అది రక్త మొలలకు దారి తీస్తుంది. ఆయుర్వేదం చెప్పిన కొన్ని టిప్స్ పాటిస్తే మొలల సమస్య తగ్గుతుంది.
కలబంద..
కలబంద చాలామంది ఇళ్ల దగ్గర అలంకరణ కోసం పెంచుతుంటారు. అయితే ఇది మొలల సమస్యకు చెక్ పెడుతుంది. తాజా కలబంద గుజ్జు తింటూ ఉంటే ఫైల్స్ సమస్య నయం అవుతుంది. కలబంద జ్యూస్ లేదా తాజా తలబంద గుజ్జు తినడం వల్ల బాహ్య మొలలు, అంతర్గత మొలలు రెండూ కూడా నయం అవుతాయి. ఇది మొలల సమస్యను తగ్గించడమే కాకుండా ప్రేగు కదలికలు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
జీలకర్ర, సోపు..
పైల్స్ సమస్యకు జీలకర్ర, సోపు కూడా చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా రక్తపు మొలల సమస్య తగ్గడానికి జీలకర్ర ప్రభావవంతంగా పని చేస్తుంది. జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. దీన్ని 1 నుండి 2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2 నుండి 3 సార్లు తినాలి. అదే విధంగా జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకోవాలి. మొలల సమస్య తొందరగానే తగ్గిపోతుంది.
బొప్పాయి..
బొప్పాయి మొలల సమస్య తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు బొప్పాయి తింటూ ఉంటే పైల్స్ సమస్య నుండి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు వీలైనంత వరకు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 14 , 2024 | 07:12 PM