ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: చిన్న వయసులోనే పెద్ద వారిలా కనబడుతున్నారా? ఈ నాలుగు అలవాట్లే కొంప ముంచుతున్నాయ్..!

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:55 AM

ఒకసారి పెద్దవాళ్లను గమనిస్తే అన్ని పనులు చేసుకుంటూ చురుగ్గా ఉంటారు. ఎంత దూరం అయినా ఆయాసపడకుండా చలాకీగా నడుస్తుంటారు. కానీ ఇప్పటి తరం వాళ్లు మాత్రం 30,40 ఏళ్లకే చాలా వయసైపోయినట్టు ఫీలవుతుంటారు.

old age

వయసు కాలంతో పాటూ పెరుగుతూ ఉంటుంది. దీని వల్లే ఎలాంటి వారు అయినా వృద్దాప్యాన్ని తప్పించుకోలేరు. కానీ కొందరు ఆహారం, జీవనశైలి జాగ్రత్తలు తీసుకుంటూ వయసు పెరిగినా సరే కుర్రాళ్లలా ఉత్సాహంగా , ఆరోగ్యంగా ఉంటారు. ఒకసారి పెద్దవాళ్లను గమనిస్తే అన్ని పనులు చేసుకుంటూ చురుగ్గా ఉంటారు. ఎంత దూరం అయినా ఆయాసపడకుండా చలాకీగా నడుస్తుంటారు. కానీ ఇప్పటి తరం వాళ్లు మాత్రం 30,40 ఏళ్లకే చాలా వయసైపోయినట్టు ఫీలవుతుంటారు. ఏ పనినీ చురుగ్గా చెయ్యలేరు. పైపెచ్చు కాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, అలసటతో పాటూ చాలా అనారోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తుంటారు. అయితే ఈ సమస్యలకు రోజువారీ జీవితంలో ఉన్న 4 అలవాట్లే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


ఆహారం..

చర్మం ముడుతలు పడటం, జుట్టు బూడిద రంగులోకి మారడం, శరీరంలో శక్తి తగ్గినట్టు ఉండటం వృద్దాప్యం లక్షణాలు. ఇవి ఇప్పట్లో 30,40 ఏళ్ల మధ్య ఉన్నవారిలో కూడా కనిపిస్తున్నాయి. తీసుకునే ఆహారం చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోడం వల్ల శరీరం లోపలి కణాల జీవితం చాలా తొందరగా ముగుస్తుంది. ఇది మాత్రమే కాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా వస్తాయి.

అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు.

అలవాట్లు..

చాలమందికి ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటాయి. వీటిని నేటి తరం వారు ఫ్యాషన్ లో భాగం చేశారు. ధూమపానం చర్మాన్ని దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యపానం కాలేయానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి వారి చర్మం, శారీరక స్థితి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తుంది.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!


శారీరక శ్రమ..

ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువగా కూర్చుని చేసే వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మానసికంగా అలసిపోయేవారి శరీరం తొందరగా వృద్దాప్యానికి లోనవుతుంది. ఇది ఊబకాయం, గుండెజబ్బులు, మానసిక అనారోగ్యం ప్రమాదాన్ని పెంచుతుంది.

క్రమం తప్పకుండా రోజూ అరగంట నుండి గంట సేపు వ్యాయామం చేస్తుండాలి. నడక, సైక్లింగ్,యోగా వంటివి భాగం చేసుకోవాలి.

ఒత్తిడి..

నేటికాలం వారు ఎక్కువగా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఒత్తిడి హార్మోన్ ను నియంత్రించాలంటే ధ్యానం,యోగా చక్కని పరిష్కారాలు. అలాగే రోజులో వీలైనంత ప్రశాంతంగా, నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించాలి. ఇది వృద్దాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 26 , 2024 | 11:55 AM

Advertising
Advertising
<