Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..
ABN, Publish Date - Nov 01 , 2024 | 03:11 PM
పండుగ అంటే సందడి మాత్రమే కాదు. ఆహారాలు కూడా కనువిందు చేస్తాయి. పిండి వంటలు,తీపి పదార్థాలు నోరూరిస్తాయి. అయితే పండుగ తరువాత చాలామంది బోలెడు సమస్యలు ఎదుర్కొంటారు.
పండుగ అంటే అందరికీ కొత్త బట్టలు, పిండి వంటలు గుర్తు వస్తాయి. ఆ తరువాతే దేవుడి పూజ అయినా గుర్తొచ్చేది. చెబితే నమ్మరు కానీ చాలా శాతం మంది ఇలాగే ఆలోచిస్తారు. దీనికి తగ్గట్టు గానే పండుగ రోజులలో వంటలు కూడా బాగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా దీపావళి అంటే పిండి వంటలు, తీపి పదార్థాల సందడి ఎక్కువ. కానీ వండిన పదార్థాలు ముందుంటే ముందు వెనుక ఆలోచించేవారు తక్కువ. తనివితీరా రుచులను ఆస్వాదించాల్సిందే అనుకునేవారు ఎక్కువ. పండుగ భోజనంతో పాటు పిండి వంటలు, తీపి పదార్థాలు తిన్న తరువాత శరీరంలో కొలెస్ట్రాల్ నుండి, చక్కెర స్థాయిల వరకు అన్నీ పెరుగుతాయి. పండుగ భోజనం కారణంగా చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్యలు.. వాటి పరిష్కాలు తెలుసుకుంటే..
Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..
పండుగ సమయంలో తీపి పదార్థాలు తినేవారు ఎక్కువ. ఇందులో చక్కెర, మైదా, నెయ్యి, నూనె వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటివి కలుగుతాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
వేయించిన ఆల్ట్రా ప్రాసెస్ ఆహారాలు శరీరంలో ప్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. తెల్ల రక్తకణాల పనితీరును దెబ్బతీస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తాయి.
పండుగ రోజు రాత్రిళ్లు వివిధ కారణాల వల్ల రాత్రిళ్లు ఎక్కువగా మేలుకోవడం వల్ల నిద్ర తగినంత ఉండదు. ఇది ఒత్తిడి హార్మోన్ ను పెంచుతుంది. ఇది ఆకలిని పెంచడం, జీర్ణక్రియను దెబ్బతీయడం, మానసిక కల్లోలం వంటి సమస్యకు దారితీస్తుంది.
పండుగ రోజు తీసుకునే స్వీట్లు, పిండి పదార్థాలు జీర్ణం కావడానికి సాధారణ భోజనం కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వీటికి తగ్గట్టు శారీరక శ్రమ ఎక్కువ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు.
పండుగ ఆహారంలో ఉప్పు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరంలో నీరు నిలుపుకోవడానికి దారి తీస్తాయి. ఈ కారణంగా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.
Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!
పరిష్కారాలు..
దీపావళి ద్వారా ఏర్పడే సమస్యలకు కొన్ని చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.
వేడినీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
శరీరం క్లియర్ కావడానికి డిటాక్స్ వాటర్ తాగాలి. ఒక లీటర్ నీటిలో కీర దోస, పుదీనా, నిమ్మకాయ ముక్కలు, అల్లం వంటివి వేసి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ డిటాక్స్ వాటర్ ను రూమ్ టెంపరేచర్ లో తాగాలి.
గ్రీన్ టీ, లెమన్ టీ, చమోమిలే టీ, హెర్బల్ టీ వంటివి జీవక్రియను మెరుగ్గా ఉంచుతాయి. పాలతో కాఫీ, టీ లకు బదులు వీటిని తీసుకోవాలి.
ఆహారంలో ఆకుకూరలను అధికంగా తీసుకోవాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ, దోశ, ఇడ్లీ వంటి ప్రో బయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..
భారతదేశంలో అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసా..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 01 , 2024 | 03:18 PM