Health Tips: కాళ్లలో బలం లేదా? ఈ ఆసనాలు వేసి చూడండి .. ఫలితాలు చూసి షాకవుతారు..!
ABN, Publish Date - May 30 , 2024 | 10:56 AM
ప్రతి ఒక్కరి శరీరం బరువు పాదాలపై ఉంటుంది. శరీర బలంగా ఉండాలన్నా, బ్యాలెన్స్డ్ గా నడవాలన్నా, నిలబడాలన్నా పాదాలు బలంగా ఉండాల్సిందే. అయితే కొందరికి కాళ్ళు బలహీనంగా , నొప్పులు పెడుతూ ఉంటాయి. కాళ్ళలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కాళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
ప్రతి ఒక్కరి శరీరం బరువు పాదాలపై ఉంటుంది. శరీర బలంగా ఉండాలన్నా, బ్యాలెన్స్డ్ గా నడవాలన్నా, నిలబడాలన్నా పాదాలు బలంగా ఉండాల్సిందే. అయితే కొందరికి కాళ్ళు బలహీనంగా , నొప్పులు పెడుతూ ఉంటాయి. కాళ్ళలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కాళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాళ్లలో బలం తగ్గి కాళ్ల నొప్పులు రావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే కాళ్లలో బలం పెరగడానికి యోగా అద్భుతంగా సహాయపడుతుంది. కొన్ని యోగా భంగిమలు కాళ్లలో బలాన్ని నింపుతాయి. అవేంటో తెలుసుకుంటే..
కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!
విపరీత కర్ణి ఆసనం..
ఒక గోడ దగ్గర కూర్చుని తుంటిని గోడకు వ్యతిరేకంగా నొక్కి ఉంచాలి. మెల్లిగా వెనుకకు పడుకోవాలి.
పాదాలను గోడపై ఉంచాలి. తరువాత తుంటి భాగాన్ని సౌకర్యంగా ఉండేలా గోడకు దగ్గరగా తీసుకురావాలి.
ఇప్పుడు పిరుదులు, తొడ, మోకాళ్లు అన్నీ సమాంతరంగా ఉంటాయి. ఇవి గోడకు ఆనుకుని ఉంటాయి. పాదల బరువు గోడలపై వేసి రిలాక్స్ గా పడుకోవాలి.
5 లేదా 10 నిమిషాలు ఈ భంగిమలో ఉండి ఆ తరువాత సాధారణ స్థితికి రావాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు శ్వాస లోతుగా తీసుకోవాలి.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
అధో ముఖ స్వనాసన..
చేతులు, మోకాళ్ల మీద బోర్లా పడుకోవాలి.
మణికట్టును భుజాల కింద, మోకాళ్లను తుంటి కింద ఉంచాలి. కాలి వేళ్లను వంచి తుంటిని పైకి ఎత్తాలి. ఇలా శరీరాన్ని వి ఆకారం రివర్స్ లో ఉండేలా తీసుకురావాలి.
చేతులను భూమి మీద గట్టిగా నొక్కుతూ వెన్నెముకను సాగదీయాలి. కాళ్లు, తొడల కండరాలను పట్టుగా ఉంచాలి.
ఉత్కటాసనం..
ఉత్కటాసనం ను తాడాసనం భంగిమతో ప్రారంభిస్తారు. తాడాసనం భంగిమ అంటే నిటారుగా బ్యాలెన్స్డ్ గా నిలబడాలి. ఇప్పుడు శ్వాస మెల్లిగా వదులుతూ కొద్దిగా ముందుకు వంగాలి.
తుంటి భాగాన్ని వంచి వెన్నెముకను మాత్రం నిటారుగానే ఉంచాలి. మోకాళ్లను కొద్దిగా వంచి కాలి వేళ్లపై శరీర బరువు ఉంచి బ్యాలెన్స్డ్ గా నిలబడాలి.
పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
పాదహస్తాసనం..
పాద హస్తాసనం వెయ్యడానికి కూడా తాడాసనంలో నిలబడాలి. మెల్లిగా ఊపిరి పీల్చుకుని వదులుగా ముందుకు వంగాలి. పాదాలను, తొడలను నిటారుగా ఉంచాలి.
తల, మెడను రిలాక్స్ చేసి తలను మోకాళ్ల వద్దకు తీసుకుని రావాలి. 30 సెకెన్ల నుండి నిమిషం వరకు ఇలాగే ఉండి తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 30 , 2024 | 01:41 PM