Health Tips: హ్యాంగోవర్ వేధిస్తుందా.. ఇలా చేస్తే మాయం..
ABN, Publish Date - Nov 04 , 2024 | 10:11 AM
మందుబాబులకు హ్యాంగోవర్ అనేది చాలా సాధారణ విషయం. కానీ దాన్నుండి బయట పడాలంటే మాత్రం నరకం కనిపిస్తుంది. ఈ టిప్స్ తో దాన్నుండి బయటపడచ్చు.
మందు రాయుళ్లకు హ్యాంగోవర్ అనేది చాలా సాధారణ విషయం. రాత్రిపూట ఫుల్లుగా మందు తాగితే ఆ తరువాత ఉదయానికి విపరీతమైన తలనొప్పి వేధించడం సహజం. తల భారం, తల నొప్పితో ఏ పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం కూడా డీహైడ్రేషన్ కు లోనవుతుంది. శరీరం చాలా అలసిపోతుంది. మద్యం మత్తులో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల హ్యాంగోవర్ సమస్య వస్తుంది. హ్యాంగోవర్ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
కార్తీక మాసంలో తులసి కోట దగ్గర రోజూ ఈ దీపం పెడుతుంటే లక్ష్మీ కటాక్షం ఖాయం..
పార్టీలలో లేదా ఫ్రెండ్స్ మీట్ లో మద్యం సేవించడం ఇప్పటి కుర్రవాళ్లకు అలవాటు. ఇక మందు బాబులు అయితే రోజూ ఠంచనుగా రాత్రవ్వగానే మందు కొడుతుంటారు. రాత్రి మద్యం తాగిన వాళ్ళు మరుసటి రోజు తమ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవాలి. రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. హ్యాంగోవర్ నుండి బయటపడటం లో సహాయం చేస్తుంది.
ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, మినరల్స్ ఉన్న ఆహరం మాత్రమే కాకుండా ఆహారంలో నీటి శాతం ఉన్న పదార్థాలు కూడా జోడించాలి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, సోడియం లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.
భారతదేశంలో అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసా..
హ్యాంగోవర్ తో ఇబ్బంది పడేవారు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రకు మించిన మార్గం లేదు. నిద్ర బాగా పట్టాలంటే ధ్యానం చేయాలి. ధ్యానంలో కూర్చోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యానంలోకి వెళ్లాలి.
చల్ల నీటితో స్నానం చేస్తున్నా హ్యాంగోవర్ కు చెక్ పెట్టవచ్చు. చల్లనీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది తల నొప్పి నుండి సులభంగా బయటపడటంలో సహాయపడుతుంది.
ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్న డ్రింక్స్ తీసుకుంటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేయవచ్చు. ఇందుకోసం స్పోర్ట్స్ డ్రింక్స్, కొబ్బరినీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆహారాలు తినండి చాలు.. ముఖం మీద ముడతలు మాయం..
తేనె గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 04 , 2024 | 10:26 AM