Health Tips: ప్రాణాయామంలో ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే.. 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ..
ABN, Publish Date - Nov 02 , 2024 | 05:20 PM
ప్రాణాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాణాయామంలో భాగం అయిన ఒక పద్దతిని పాటించడం వద్ద ఆశ్చర్యకరంగా జబ్బులు నయమవడమే కాకుండా ఆయుష్షు పెరుగుతుంది.
భారతదేశ ఋషులు, మహర్షులు భారతీయులకు, ఈ భారతదేశానికి ప్రసాదించిన గొప్ప మార్గం యోగ.. యోగలో ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు వంటివి భాగమై ఉంటాయి. ఇవన్నీ ప్రతిరోజూ పాటిస్తే మనిషి జీవితకాలం ఊహించని విధంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ప్రాణ శక్తి పెరుగుతుందని, దీని వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతారు. ప్రాణాయామంలో కూడా వివిధ రకాల పద్దతులు ఉన్నాయి. వీటిలో ఒక ట్రిక్ ను ప్రతిరోజూ పాటిస్తుంటే ప్రాణశక్తి పెరిగి వందేళ్ళ ధీర్ఘాయుష్షు సాధ్యమవుతుందని అంటున్నారు. ఇంతకూ ఈ ట్రిక్ ఏంటి? దీని వల్ల ఆయుష్షు ఎలా పెరుగుుతంది? తెలుసుకుంటే..
Optical Illusion: ఛాలెంజ్ చేస్తారా.. ఫొటోలో ఎలుగుబంటి ఎక్కడ ఉందో కనిపెడతారా..
ప్రాణాయామం అనేది శ్వాస వ్యాయామం. ఇది ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది. రోజూ ఊపిరితిత్తులను బలంగా మార్చే ప్రాణాయామం చేయడం వల్ల శరీరం కూడా శుద్ది అవుతుంది. ప్రాణాయామంలో హఠయోగ అని ఉంటుంది. ఇందులో అనులోమ, విలోమ ప్రాణాయామం అని ఒక భాగం.
ఎలా చేస్తారు..
అనులోమ, విలోమ ప్రాణాయామంలో ముక్కు కుడివైపు రంధ్రం నుండి గాలిని పీల్చుకుంటారు. ఈ సమయంలో ఎడమ రంధ్రాన్ని చేతి చిటికెన వేలు, ఉంగరపు వేలుతో మూసి ఉంచుతారు. ఆ తరువాత బొటనవేలితో కుడివైపు రంధ్రాన్ని మూసి ఉంచుతారు. ఎడమ రంధ్రం నుండి గాలిని మెల్లగా వదులుతారు. ఇప్పుడు అదే ఎడమ రంధ్రం నుండి గాలిని మెల్లిగా పీల్చుకుంటారు. తరువాత చిటికెన వేలు, ఉంగరపు వేలి సహాయంతో ఎడమ రంధ్రాన్ని మూసి కుడివైపు నుండి గాలిని వదులుతారు. ఇలా కుడి, ఎడమ ముక్కు రంధ్రాల నుండి గాలిని పీల్చడం, వదలడం, వదిలిన రంధ్రం నుండే మళ్లీ గాలి పీల్చడం వల్ల దీనికి అనులోమ, విలోమ ప్రాణాయామం అనే పేరు వచ్చింది. ఈ ప్రాణాయామం మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా సహాయపడుతుంది.
IQ Test: మీ ఐక్యూ లెవల్స్ కు ఇదే ఛాలెంజ్.. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
ప్రయోజనాలు..
అనులోమ విలోమ ప్రాణాయామం రోజూ చేస్తుంటే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది. రిలాక్స్ గా ఉంచుతుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
అనులోమ, విలోమ ప్రాణాయామం శ్వాసను క్రమబద్ధీకరిస్తుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది. నిద్రలేమి, నిద్రలో ఆటంకాలు వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.
అనులోమ, విలోమ ప్రాణాయామం చేసేవారి రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ ప్రాణాయామ పద్దతిని పాటిస్తుంటే రక్తపోటు అదుపులో ఉండటం ద్వారా గుండె పోటు ప్రమాదాలు కూడా తగ్గిస్తుంది.
జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో అనులోమ, విలోమ ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ ప్రాణాయామ పద్దతి పాటిస్తుంటే మలబద్దకం, ఆమ్లతత్వం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో అనులోమ, విలోమ ప్రాణాయామం సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లు, సీజన్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
Health Tips: ఖర్జూరం విత్తనాల కాఫీ ఎప్పుడైనా తాగారా.. దీంతో ఎన్ని లాభాలంటే..
అనులోమ, విలోమ ప్రాణాయామం చేసేవారి ఏకాగ్రత చాలా మెరుగ్గా ఉంటుంది. వీరి జ్ఞాపకశక్తి, ఆలోచనా తీరు, చురుగ్గా విషయాలను అర్థం చేసుకోవడం వంటివి సాధ్యమవుతాయి.
మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారికి ఒక ఖచ్చితమైన వైద్యం అంటూ ఉండదు. అలాంటి వారికి అనులోమ, విలోమ ప్రాణాయామం బాగా సహాయపడుతుంది.
శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. అలసట, బద్దకం తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్రాణాయామ పద్దతి పాటిస్తుంటే ఆయుష్షు పెరుగుతుంది. ఉబ్బసం సమస్యతో ఇబ్బంది పడేవారికి, ఆస్తమా లక్షణాలు ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..
Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 02 , 2024 | 05:20 PM