ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips: భోజనం చేసిన వెంటనే నీరు తాగుతున్నారా? రిస్క్ చేస్తున్నట్టేనట..!

ABN, Publish Date - May 21 , 2024 | 02:45 PM

చాలామంది భోజనం చేస్తూ నీరు తాగుతుంటారు. కొందరు భోజనం చేసేటప్పుడు నీరు తాగరు కానీ భోజనం చేసిన తరువాత పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగడం గురించి చాలామందికి అవగాహన ఉండదు.

టిఫిన్, భోజనం, స్నాక్స్.. ఇలా ఏం తింటున్నా సరే పక్కనే మంచినీళ్లు తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది భోజనం చేస్తూ నీరు తాగుతుంటారు. కొందరు భోజనం చేసేటప్పుడు నీరు తాగరు కానీ భోజనం చేసిన తరువాత పెద్ద మొత్తంలో నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగడం గురించి చాలామందికి అవగాహన ఉండదు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు భోజనం తర్వాత నీరు తాగితే ఏమవుతుంది? నిజాలు తెలుసుకుంటే..

భోజనం చేసిన తరువాత కనీసం ఓ గ్లాసు నీరు అయినా తాగేస్తుంటారు చాలామంది. కానీ ఈ అలవాటు వల్ల జీర్ణ రసాలు ప్రభావితం అవుతాయి. కడుపులో ఉండే సహజమైన ఆమ్లాలు, ఎంజైమ్ లు ఈ అలవాటు వల్ల కరిగిపోతాయి. జీర్ణరసాలు పలుచన అవుతాయి. ఇది జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది. ఆహారం మింగడానికి ఇబ్బంది అయినప్పుడు చిన్న చిన్న సిప్ లతో నీరు తాగడం మంచిదే. కానీ పెద్ద మొత్తంలో నీరు తాగడం మాత్రం మంచిది కాదు.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!


భోజనం చేసిన తరువాత నీరు తాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. దీని వల్ల ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. కానీ తీసుకున్న ఆహారంలో పోషకాలను శరీరం గ్రహించలేదు. ఈ కారణంగా మంచి ఆహారం తీసుకున్నా సరే.. దాని తాలూకు పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి.

కడుపులో ఉండే జీర్ణ రసాలు పలుచన కావడానికి అధికంగా నీరు తాగడం ఒక కారణం. అందుకే భోజనం చెయ్యడానికి ఒక 10నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 10 నిమిషాల తరువాత నీరు తాగడం మంచిదట.

భోజనం చేసిన తరువాత నీరు తాగడం అలవాటు చేసుకుంటే అది ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుందట. ఈ కారణంగా శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయని ఆహార నిపుణులు, పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

తిన్న ఆహారం శరీరానకి సరిగా ఒంటబట్టాలన్నా, ఆహారంలో పోషకాలు శరీరానికి సరిగా అందాలన్నా ఆహారం తినడానికి 30నిమిషాల ముందు లేదా ఆహారం తిన్న 30నిమిషాల తరువాత మాత్రమే నీరు తీసుకోవాలి. ఆహారం తిన్న తరువాత 30 నిమిషాల విరామం జీర్ణాశయ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి తోడ్పడుతుంది.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2024 | 02:45 PM

Advertising
Advertising