Health Tips: ఖర్జూరం విత్తనాల కాఫీ ఎప్పుడైనా తాగారా.. దీంతో ఎన్ని లాభాలంటే..
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:58 PM
చాలామందికి కాఫీ, టీ అంటే చెప్పలేని ఎమోషన్.. కానీ ఖర్జూరం విత్తనాలతో తయారుచేసే కాఫీ గురించి తెలిసిన వారు తక్కువ అని చెప్పవచ్చు.
ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంది. మహిళలు తప్పనిసరిగా రోజుకు ఒక ఖర్జూరం అయినా తినాలని చెబుతుంటారు. ఖర్జూరంలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కు కూడా తక్కువేం లేదు. కార్బోహేడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క ఖర్జూరం తినగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది. అయితే ఖర్జూరం తినే చాలామంది ఒక తప్పు చేస్తుంటారు. ఖర్జూరాన్ని తిని అందులో విత్తనం పడేస్తుంటారు. కానీ ఖర్జూరం విత్తనాలతో కాఫీ తయారు చేస్తారని తెలుసా..? ఈ విషయం వినగానే షాకయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ ఖర్జూరం విత్తనాలతో నిజంగానే కాఫీ తయారుచేసుకుని తాగుతారు. దీని వల్ల ప్రయోజనాలు కూడా చాలా షాకింగ్ గానే ఉంటాయి. ఇంతకీ ఈ ఖర్జూరం విత్తనాల కాఫీ ఎలా తయారు చేస్తారు, దీని వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే..
IQ Test: మీ ఐక్యూ లెవల్స్ కు ఇదే ఛాలెంజ్.. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
ఖర్జూరం విత్తనాల కాఫీ పౌడర్..
ఖర్జూరం విత్తనాలతో కాఫీ పౌడర్ తయారు చేయడానికి ఖర్జూరం విత్తనాలను సేకరించుకోవాలి. ఖర్జూరం విత్తనాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వీటిని ఒక మందం బాండీలో వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. సువాసన వచ్చే వరకు వేగిన విత్తనాలను చల్లరానివ్వాలి. ఆ తరువాత విత్తనాలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఖర్జూరం విత్తనాల కాఫీ పౌడర్ తయారైనట్టే..
ఎలా వాడాలి..
ఖర్జూరం విత్తనాల కాఫీ పౌడర్ ను సాధారణ కాఫీ, టీ పొడికి బదులుగా వినియోగించవచ్చు. ఈ కాఫీ పొడిలో కెఫీన్ ఉండదు. ఈ కారణంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..
ప్రయోజనాలు..
అధిక బరువుతో ఇబ్బంది పడే వారు ఖర్జూరం విత్తనాలతో తయారు చేసిన కాఫీ తాగితే చాలా మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తుంది.
లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నవారు ఖర్జూరం విత్తనాల కాఫీ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
డయాబెటిస్ తగ్గించడంలో కూడా ఖర్జూరం విత్తనాలు అద్భుతంగా సహాయపడతాయి. పాలతో తయారు చేసే కెఫీన్ కాపీ, టీ లకు బదులు ఖర్జూరం విత్తనాల కాఫీ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!
Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 02 , 2024 | 01:58 PM