ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips: 83ఏళ్ల డాక్టర్ చెప్పిన ఫుడ్ సీక్రెట్ ఇదీ.. ఈ ఆహారాలు తింటే వృద్దాప్యంలోనూ యంగ్ గా ఉండొచ్చట..!

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:54 AM

కేవలం నాలుగు ఆహారపు అలవాట్లు ఫాలో అయితే చాలు.. ఎంత వయసైనా యంగ్ గా ఉండొచ్చు

సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం కావాల్సిందే.. ఆహారమే శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గడం, అవయవాల పనితీరు మందగించడం జరుగుతుంది. కానీ జోసెఫ్ అనే వైద్యుడు మాత్రం 83ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా యంగ్ గా ఉన్నాడు. ఈయన ఇప్పటివరకు పలు స్విమ్మింగ్, సైక్లింగ్, మారథాన్ రన్ లలో పాల్గొన్నారు కూడా. దీని వెనుక ఆయన పాటించే నాలుగు ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుుకుంటే..

మెడిటేరియన్ డైట్..

మెడిటేరియన్ డైట్ ఫాలో అయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ఆహారంలో మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు తప్పనిసరిగా కొద్ది మొత్తంలో అయినా తీసుకోవాలి. ఫైబర్, ఖనిజాలు, ఆరోగ్యకర కొవ్వులు, కొలెస్ట్రాల్, అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందేలా చేూడాలి. ఇవన్నీశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ వ్యాధులతో శరీరం పోరాడేందుకు సహాయపడతాయి.


అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ..

ఆరోగ్యంగా ఉండాలంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ మానేయాలి. ప్యాక్ చేసిన ఆహారాలు, సూప్, చిప్స్, క్యాండీస్, చాక్లెట్, ఐస్ క్రీం, చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తీసుకోకూడదు. వీటిలో ఫైబర్ తక్కువ, చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలకు ఇవి కారణమవుతాయి.

ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు..

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి హైడ్రోజనేషన్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పడతాయి. ఇవి శరీరానికి చాలా హానిచేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంతో పాటూ గుండెపోటు, స్ట్రేక్, మధుమేహం ప్రమాదం పెంచుతాయి.

చక్కెర..

చక్కెర ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హని కలిగిస్తుంది. దీని వల్ల ఊబకాయం మాత్రమే కాకుండా మధుమేహం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహారం నుండి చక్కెరను తగ్గించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 10:54 AM

Advertising
Advertising