Morning Walk: చలికాలంలో మార్నింగ్ వాక్ మంచిదేనా.. ఈ విషయాలు తెలుసుకోండి..
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:05 PM
చలికాలమైనా.. వేసవికాలమైనా.., ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా నడవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఏ సమయంలోనైనా వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రతిరోజూ అరగంట ఉదయపు నడక గుండెతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందంటారు. అయితే, ఏ సీజన్ అయినా ఓకే కానీ.. చలికాలంలో మార్నింగ్ వాక్ కు వెళ్లడంపై చాలా మందిలో సందేహాలున్నాయి. ప్రమాదకరమైన చలి గాలుల మధ్య వాకింగ్ చేయడం అసలు మంచిదేనా అనే విషయాలపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
చలికాలంలో అతిగా నడవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఆరోగ్యసమస్యలు ఉన్నవారు ఉదయంపూట అతిగా నడిస్తే లేని సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనంటున్నారు. కొంతమందిలో ఇది గుండెపోటుకు దారితీయొచ్చు. మరికొందరిలో వాతావరణంలో ఉండే తేమ ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస సంబంధ సమస్యలు తీసుకురావచ్చు. మరి వీటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
1. చలికాలంలో వాకింగ్ కు వెళ్లే సమయాలను జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఉదయం 7 నుండి 7:30 వరకు.. సాయంత్రం 5 నుండి 5:30 మధ్యనే వాకింగ్‌కు సమయం కేటాయించుకోవాలి.
2. చలికాలంలో ఎక్కువ బరువుగా ఉన్న దుస్తుల జోలికి వెళ్లకపోవడమే మంచింది. అదే సమయంలో బయటి చలిని తట్టుకునేలా స్వెట్లర్లు, మఫ్లర్లను ధరించాలి. అవసరమైతే వెంటనే తీసేసేలా సౌకర్యంగా ఉండాలి.
3. తలతో పాటు చెవులను కప్పి ఉంచేలా ప్రయత్నించండి. లేదంటే చలి గాలుల తీవ్రతకు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.
3. మొదట్లో వేగంగా నడకను మొదలుపెట్టి ఆ తర్వాత వేగాన్ని తగ్గిస్తూ నడవాలి. ఇలా బ్యాలెన్స్ చేయడం వల్ల శ్వాస వేగాన్ని నియంత్రించవచ్చు.
4. మీకు గుండె సమస్యలు, ఆస్తమా లేదా న్యుమోనియా వంటి సమస్యలు ఉంటే ఉదయం నడకకు ఈ సీజన్ లో గుడ్ బై చెప్పండి. సాయంత్రం వేళల్లో నడవడం అలవాటు చేసుకోండి.
5. మరీ చలిలో కాకుండా కాస్త సూర్యరశ్మి ఉన్న సమయంలోనే బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాలి.
6. వాతావరణ సూచనల ప్రకారం ప్రమాదకర స్థాయిలో చలి ఉన్నరోజున వాకింగ్ కు వెళ్లకపోవడమే మంచింది.
7. ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో కూడా అదే చేయండి. అయితే ఉదయం వీలు కాకపోతే సాయంత్రం వెళ్లండి.
9. చలికాలంలో కొంచెం తక్కువగా నడవడం వల్ల ఎలాంటి హాని జరగదు. అపోహలు మాని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
10. శీతాకాలంలో వారానికి కనీసం ఐదు రోజులు అరగంట పాటు నడవడం తప్పనిసరి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి బయటపడేస్తుంది.
Updated Date - Nov 29 , 2024 | 05:05 PM