Heart Blockage: మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..
ABN, Publish Date - Oct 17 , 2024 | 01:16 PM
గుండెకు రక్తం సరఫరా కావడంలో ధమనులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి శుభ్రంగా ఉన్నాయో ఎలా తెలుస్తుందంటే..
గుండె మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. గుండె పనితీరును బట్టే మనిషి ఆయుష్షును నిర్ణయిస్తారు. నేటి కాలంలో గుండెకు రక్తం సరఫరా సరిగా లేక గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలే ఎక్కువ ఉంటున్నాయి. అసలు గుండెకు రక్తం సరఫరా కావడంలో ఆటంకాలు ఎందుకు ఏర్పడతాయి? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? తెలుసుకుంటే..
ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి..!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకైనప్పుడు లేదా అడ్డంకిగా మారినప్పుడు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలవబడే హార్ట్ బ్లాకేజ్ సమస్య వస్తుంది. ఈ సమస్య ప్రధానంగా కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్, ఇతర పదార్ధాల చేరడం వల్ల ధమని గోడలలో ఫలకాలు ఏర్పడతాయి. ఈ ఫలకాలు గట్టిపడటం, చీలిపోవడం వంటివి జరగడం వల్ల గుండె కండరాలకు రక్త ప్రసరణను తగ్గుతుంది. దీని వల్ల ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే సమస్యను ఆంజినా అని అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హార్ట్ బ్లాక్‌ను గుర్తించడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని లక్షణాల ద్వారా ధమనులలో అడ్డంకులు ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు..
హార్ట్ బ్లాక్‌లను వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించవచ్చు. మూడు స్థాయిల అడ్డంకులు ఉన్నాయి..
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఫస్ట్-డిగ్రీ హార్ట్ బ్లాక్..
ఇది మొదటి స్థాయి హార్ట్ బ్లాక్.. దీనికి ఎక్కువ వైద్య చికిత్స అవసరం ఉండకపోవచ్చు. రోగులు ఈ స్థాయిలో ఎటువంటి లక్షణాలు లేకుండా జీవితాన్ని గడపుతారు. ఇది ECGలో తెలుస్తుంది.
సెకండ్-డిగ్రీ హార్ట్ బ్లాక్..
ఇందులో విద్యుత్ సంకేతాలు గుండెలోని అన్ని గదులకు చేరవు. గుండె సాధారణ వేగంతో కొట్టుకోవడంలో సహాయపడటానికి పేస్‌మేకర్ అవసరం కావచ్చు.
థర్డ్-డిగ్రీ హార్ట్ బ్లాక్..
ఇందులో జఠరికలు, కర్ణిక మధ్య కమ్యూనికేషన్ ఉండదు. ఇది చాలా తీవ్రమైన స్థాయి. ఇది మెడికల్ ఎమర్జెన్సీగా కూడా మారవచ్చు.
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు పసుపు పాలు తాగకూడదు..!
హార్ట్ బ్లాకేజ్ రాకూడదంటే..
జీవనశైలి మార్పుల ద్వారా గుండె ఆగిపోవడాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజంతా చురుగ్గా ఉండటం. బరువును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలను అధిగమించవచ్చు.
ఇవి కూడా చదవండి..
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 17 , 2024 | 01:16 PM