High Cholesterol: ఈ 5 లక్షణాలు కనిపిస్తే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందన్నట్టే లెక్క.. ఇంతకీ అవేంటంటే..!
ABN, Publish Date - Mar 30 , 2024 | 11:04 AM
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ 5 లక్షలాలలో ఏదో ఒకటి పక్కా కనిపిస్తుంది.

కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడే ఒకరకమైన కొవ్వు. శరీరం చాలా పనులు చేయడానికి ఈ కొవ్వు అవసరం అవుతుంది. అయితే ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ కాగా.. రెండవది చెడు కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం. మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
అలసట..
ఏదైనా పనిచేస్తున్నప్పుడు తొందరగా అలసిపోతే అది సాధారణమైన విషయంగా తీసుకోకూడదు. ముఖ్యంగా కొద్ది దూరం నడిచినా, కొన్ని మెట్లు ఎక్కినా, కొద్ది బరువు ఎత్తగానే ఆయసం వచ్చినా ఊపిరి ఆడటంలో ఇబ్బందులు తలెత్తినా అది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయికి సంకేతం కావచ్చు. వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిని చెక్ చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!
చేతులు, కాళ్లలో కరెంట్ షాక్..
రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. ఇలాంటి సందర్భాలలో కాళ్లు, చేతులలో జలదరింపు లేదా కరెంట్ షాక్ కొట్టిన అనుభూతి కలుగుతుంది. కొందరికి ఇలా షాక్ తో పాటూ నొప్పి కూడా ఉంటుంది. ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేసే రక్తం శరీరంలో పరిధీయ సిరలను చేరుకోనప్పుడు ఇది జరుగుతుంది.
గుండె నొప్పి..
కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైతే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తసరఫరా తగ్గుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గితే గుండె నొప్పి, గుండె పోటు సమస్యలు వస్తాయి.
పొట్ట, నడుము..
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అది శరీరాకృతి మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది పొట్ట, నడుము, పిరుదులు మొదలైన ప్రాంతాలలో పేరుకుపోతుంటుంది. శరీరంలో ఇలా ఎక్కుడైనా కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్టే.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 11:04 AM