ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Urinary Problems: వేసవిలో మూత్ర విసర్జన సమస్యలా.. ఇలా చేయకపోతే డేంజరే

ABN, Publish Date - Apr 02 , 2024 | 04:45 PM

అసలే వేసవి కాలం.. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగే సమయం. ఇలాంటి టైంలో చాలా మందికి తరచూ మూత్ర విసర్జనప్పుడు మంట రావడం వంటి సమస్యలు వేధిస్తుంది. వీటిని నివారించడానికి కింది మార్గాలు అనుసరించండి..

ఇంటర్నెట్ డెస్క్: అసలే వేసవి కాలం.. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగే సమయం. ఇలాంటి టైంలో చాలా మందికి తరచూ మూత్ర విసర్జనప్పుడు మంట రావడం వంటి సమస్యలు వేధిస్తుంది. వీటిని నివారించడానికి కింది మార్గాలు అనుసరించండి..

హైడ్రేషన్..

వేసవి కాలం కావడంతో శరీరంలో నీటి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తుంది. తద్వారా శరీరం డీహైడ్రేషన్ కి గురై మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి రోజుకు కనీసం 8 - 10 గ్లాసుల నీరు తాగాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు నీరు తప్పకుండా వెంట పెట్టుకోవాలి.

కెఫిన్, ఆల్కహాల్..

కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలు తాగటం మూత్ర విసర్జనపై ప్రభావం చూపుతాయి. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. అత్యంత వేడిగా ఉండే సమయాల్లో వీటిని తీసుకోకపోవడమే మంచిది.

దుస్తులు

శ్వాసక్రియకు అనువుగా ఉండే కాటన్ లేదా నారతో చేసే బట్టలతో తయారు చేసిన తేలికైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోండి. ఈ దుస్తులు శరీరానికి గాలిని ప్రసరిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి, చెమటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

స్నానం..

ఎండాకాలంలో రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయండి. చన్నీటి స్నానంతో వేడి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిని వాడవచ్చు. స్నానం వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఫ్యాన్లు, ఏసీలు..

రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో ఏసీలు, ఫ్యాన్లు వాడండి. వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండండి.

కూలింగ్ ఫుడ్స్..

పుచ్చకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీలు, ఆకు కూరలు వంటి హైడ్రేటింగ్, కూలింగ్ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి అవసరమైన పోషకాలు అందించడంతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.


పరిశుభ్రత..

మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పరిశుభ్రత అవసరం. బాత్రూమ్ ఉపయోగించిన తరువాత ముందు నుంచి వెనక్కి కడుక్కోండి. తద్వారా మలద్వారం నుంచి మూత్ర నాళానికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

వ్యాయామం..

వ్యాయామం చేయడం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అయితే ఆరుబయట వ్యాయామం చేస్తున్నప్పుడు వేడిని గుర్తించుకోండి. వేకువజామున, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేయడం మంచిది. వ్యాయామం మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోండి.

సూర్యుడి కిరణాల నుంచి రక్షణ..

సూర్యుడి కిరణాల నుంచి రక్షించుకోవడానికి సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్, టోపీ వంటివి వాడండి. ఇవి హానికరమైన యూవీ కిరణాలను కంటిపై పడకుండా చేస్తాయి. టోపీతో వడదెబ్బ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

మూత్రం లక్షణాలు పరిశీలించండి..

మూత్ర అలవాట్లు, లక్షణాల్లో ఏవైనా మార్పులు జరగడం, నొప్పి వస్తుంటే జాగ్రత్త పడండి. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 04:47 PM

Advertising
Advertising