ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kids Health: డైపర్స్ కారణంగా పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయా? ఈ టిప్స్ తో తగ్గించేయండి..!

ABN, Publish Date - Aug 23 , 2024 | 07:58 PM

ఇప్పట్లో పిల్లలకు డైపర్స్ తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు తీసుకెళ్లినా డైపర్స్ వేసే తల్లులు ఉన్నారు. అయితే వీటి వల్ల పిల్లల చర్మం దెబ్బ తింటుంది. చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, దురద వంటివి వస్తాయి.

Diaper rashes

పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కొద్దిపాటి వాతావరణ మార్పులకే పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక వారి లేత శరీరం, చర్మం కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇప్పట్లో పిల్లలకు డైపర్స్ తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు తీసుకెళ్లినా డైపర్స్ వేసే తల్లులు ఉన్నారు. అయితే వీటి వల్ల పిల్లల చర్మం దెబ్బ తింటుంది. చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, దురద వంటివి వస్తాయి. ఈ కారణంగా పిల్లలు చాలా ఇబ్బందికి లోనవుతారు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ దద్దుర్లను తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

Viral: మీకు తెలుసా? ఉత్తర కొరియా ప్రజలు జీన్స్ ధరించరు.. ఎందుకంటే..!



తల్లిపాలు..

తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. తల్లి పాలను పిల్లల డైపర్ దద్దుర్లు మీద పూస్తే అది సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. దీనికి పెద్దగా శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ చాలా మంది తల్లులు బిడ్డ చర్మంపై తల్లి పాలను పూయడం వల్ల దద్దుర్లు తగ్గించవచ్చు. పిల్లలకు డైపర్స్ కారణంగా అయినా లేదా ఇతర దుస్తుల వల్ల అయినా శరీరం మీద దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివి ఏర్పడితే తల్లిపాలు పూయడం మంచిది. తల్లిపాలు చాలా సహజమైనవి కాబట్టి పిల్లలకు సైడ్ ఎఫెక్స్ట్ ఏమీ ఉండవు.

కొబ్బరినూనె..

పిల్లల చర్మానికి హైడ్రేటింగ్ గుణాలు అందించడంలో కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను అందరూ ఉపయోగించవచ్చు అయినప్పటికీ దద్దుర్లు వచ్చిన చర్మం పై కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది. దద్దుర్ల తాలుకూ మంట, దురద, అసౌకర్యం అన్నీ కొబ్బరి నూనె వల్ల తగ్గుతాయి.

Health Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంత స్లిమ్ అవుతారంటే..!



హోమ్ మేడ్ క్రీమ్..

పిల్లల డైపర్ దద్దుర్లు తొలగించడానికి ఇంట్లో క్రీమ్ తయారు చేసి వాడచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొబ్బరినూనె, కొంచెం ఆలివ్ నూనె, కొంచెం షియా బటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఇది క్రీమ్ లాగా తయారవుతుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ క్రీమ్ డైపర్ ర్యాష్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని చేతులతో తీసుకుని రబ్ చేయాలి. ఇది వెచ్చగా మారుతుంది. అప్పుడు దీన్ని డైపర్ దద్దుర్ల మీద అప్లై చేయాలి. డైపర్ దద్దుర్లు తగ్గుతాయి. అయితే డైపర్ దద్దుర్లు చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు వదిలి చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి.

గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!

అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 07:59 PM

Advertising
Advertising
<