Kids Health: చిన్నపిల్లలో బయటపడుతున్న అధిక రక్తపోటు సమస్య.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే..!
ABN, Publish Date - May 04 , 2024 | 12:11 PM
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్న పిల్లలలో అధిక రక్తపోటు ఎదురుకావడం అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఈ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయంటే..
నాకు బీపీ తెప్పించొద్దు.. చాలామంది యువత మాట్లాడే మాట ఇది. వయసులో ఉన్న వారిలో ఉడుకు రక్తం ఉంటుంది. వారికి కోపం ఎక్కువ. ఈ కారణంగా తొందరగా బీపీ వచ్చేస్తుంది. ఇక పెద్దలకు కోపం ఎక్కువే వారికి కూడా బీపి తొందరగా వచ్చేస్తుంది. అంతేనా.. వయసు పైబడిన వారిలో కూడా అధిక రక్తపోటు సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్న పిల్లలలో అధిక రక్తపోటు ఎదురుకావడం అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఈ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే..
చిన్నతనంలోనూ, కౌమార దశలోనూ స్ట్రోక్ కారణంగా గుండెపోటు వంటి తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి 15మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. 13 సంవత్సరాల తర్వాత హైపర్ టెన్షన్ తో బాధపడేవారు గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ సర్జరీ.. మొదలైనవి ఎదుర్కునే ప్రమాదం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?
అధిక రక్తపోటు ఉన్న పిల్లలు పెరిగే కొద్దీ గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుుతంది. ఈ ప్రమాదం తగ్గించుకోవడానికి రక్తపోటు స్క్రీనింగ్ చికిత్సను పెంచాలని నిపుణులు చెప్పుకొచ్చారు. దీని వల్ల పిల్లలు పెరిగే కొద్దీ వారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?
రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
మరిన్ని ఆరోగ్య వార్తల కసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 04 , 2024 | 12:11 PM