ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Korean Skin: రోజూ ఈ 3 టిప్స్ పాటిస్తుంటే చాలు కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం..!

ABN, Publish Date - Oct 18 , 2024 | 04:38 PM

కొరియన్ స్కిన్ ఇప్పట్లో ప్రతి అమ్మాయి కల. ఈ స్కిన్ లభించాలంటే మూడు టిప్స్ పాటిస్తే చాలు.

Korean Skin

కొరియన్ స్కిన్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది. కొరియన్ అమ్మాయిల చర్మం యవ్వనంగా, గాజులాగా మెరిసిపోతూ ఉంటుంది. ముఖం మీద ఎక్కడా మచ్చ కానీ, ముడుతలు కానీ అస్సలు కనిపించవు. వారు మేకప్ కూడా మరీ ఎక్కువగా వేసుకోరు. నేచురల్ బ్యూటీలు గానే ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్నారు. వారిని చూసి చాలామంది అమ్మాయిలు అలాంటి స్కిన్ కోసం ట్రై చేస్తుంటారు. బ్యూటీ బ్రాండ్ లు కూడా మగువల బలహీనతను క్యాష్ చేసుకునే మార్గంలో కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ ను మార్కెట్లో ప్రవేశ పెడుతోంది. అయితే ఇంట్లోనే మూడు బ్యూటీ టిప్స్ రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల కొరియన్ అమ్మాయిల లాంటి గ్లాస్ స్కిన్ సొంతమవుతుందట. అవేంటంటే..

Kitchen Tips: అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదేనా దీన్నెలా నిల్వ చేయాలంటే..


స్టీమింగ్..

రోజూ ముఖానికి తేలికగా ఆవిరి పట్టుకోవడం కొరియన్ స్కిన్ పొందడంలో సహాయపడుతుందట. మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు తెరవడంలో ఇది సహాయపడుతుందట. చర్మంలో చిక్కుకున్న మలినాలను, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. మొటిమల తాలుకు గుర్తులను తగ్గిస్తుంది. ఆవిరి పట్టుకున్న తరువాత ముఖాన్ని చేతి వేళ్లతో వృత్తాకారంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మెరుగ్గా ఉంటుంది.

డబుల్ క్లీన్..

ముఖాన్ని రెండుసార్లు శుభ్రపరచాలి. దీని కోసం మెకెల్లార్ క్లెన్సింగ్ వాటర్ అవసరం అవుతాయి. ఈ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత మంచి ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వాష్ క్లాత్ ఉపయోగించడం వల్ల ముఖం మీద మలినాలు తొలగిపోతాయి. ఇవి చర్మ రంధ్రాలను సురక్షితంగా చెక్కుచెదరకుండా ఉంచుతాయి.

Health Tips: వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..


టోన్..

నీరు అధికంగా ఉన్న పదార్థాలతో ముఖాన్ని టోన్ చేయాలి. ఇలా చేస్తే పెద్దగా ఉన్న చర్మ రంధ్రాల పరిమాణం తగ్గుతాయి. కొరియన్ అమ్మాయిలు ముఖాన్ని టోన్ చేయడానికి రైస్ వాటర్ ను ఉపయోగిస్తారు. ఇది చర్మం కొల్లాజెన్ ను పెంచుతుంది. ముఖ చర్మం కూడా కాంతివంతం అవుతుంది. టోనర్ ఉపయోగించిన తరువాత ముఖానికి మంచి మాయిశ్చరైజర్ కూడ ఉపయోగించాలి. విటమిన్స్ కలిగి ఉన్న మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తే చర్మ కణాలు మరింత హైడ్రేట్ గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

Heart Blockage: మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..

నారింజ తొక్కల గురించి మీకు తెలియని నిజాలివి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 18 , 2024 | 04:38 PM