ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Life Lesson: జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే వెంటనే ఈ 6 అలవాట్లు వదిలేయండి..!

ABN, Publish Date - Oct 11 , 2024 | 05:12 PM

జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సంతోషంగా బ్రతకాలనే చాలా విషయాలలో రిస్క్ కూడా చేస్తారు. కానీ ఈ 6 అలవాట్లు వదిలేస్తేనే సంతోషంగా ఉండగలరు.

Life Lesson

సంతోషకరమైన జీవితం ప్రతి ఒక్కరి ఆశ. కష్టాలకు దూరంగా వెళ్లాలని, ఆనందానికి దగ్గరగా ఉండాలని అనుకునే వారే ఎక్కువ. అయితే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ స్వయంకృతాపరాధమే.. చాలామంది తాము చేసే పనుల వల్లనే కష్టాలు, బాధలు ఎదుర్కుంటారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే 6 అలవాట్లను వెంటనే వదిలేయమని జీవినశైలి నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

అతిగా ఆలోచించడం..

అతిగా ఆలోచించడం సంతోషాన్ని నాశనం చేస్తుంది. అతిగా ఆలోచించే వారు ఏదైనా సమస్యను చాలా తీవ్రమైనదిగా ఊహించుకుంటాడు. ఒత్తిడి, ఆందోళనను పెంచుకుంటాడు. ఇది కాస్తా సంతోషాన్ని దూరం చేస్తుంది.

ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? మీకు తెలియని నిజాలివీ..!


గతం..

చాలమంది గతంలో చిక్కుకుపోయి బాధపడుతూ ఉంటారు. గత జీవితంలో వ్యక్తుల పరిచయాలు, సంఘటనలు, విషాదాన్ని మిగిల్చిన సందర్భాలు మొదలైనవి గుర్తు చేసుకుంటూ ఉంటే సంతోషాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు.

నెగిటివ్ గా ఆలోచించడం..

ప్రతి ఒక్కరూ తమతో తాము మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల తమలో ఉన్న బలాలు, బలహీనతలు, తమను తాము మెరుగుపరుచుకునే విధానాలు మొదలైనవి తెలుస్తాయి. కానీ తమలో తాము మాట్లాడుకుంటూ ఆలోచించే వారు నెగిటివ్ గా ఉంటే వారిలో సంతోషం అనేది ఉండదు.

పోలిక..

ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకం. ఎవరూ ఇతరులకు పోలిక కాదు. ఇతరులతో తమను తాము పోల్చుకునే వ్యక్తులు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. పోలిక పెట్టుకుని తమలో లోటుపాట్లు చూసుకునే వారు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు కూడా.

మెమరీ పవర్ మెరుగవ్వాలంటే.. ఈ సులువైన ట్రిక్స్ ఫాలో అవ్వండి..!


సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం..

సెల్ఫ్ కేర్ తీసుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. కానీ తమ గురించి తాము ఆలోచించుకోకుండా ఉండేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. మంచి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి, మంచి విషయాలు, ఆరోగ్య జాగ్రత్తలు, మానసికంగా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించడం వంటివి సంతోషాన్ని ఇస్తాయి.

కోపం..

ఎప్పుడూ కోపంగా ఉండేవారికి సంతోషం, ప్రశాంతత లభించవు. ఎవరితో అయినా గొడవ పడినా, విభేదాలు వచ్చినా, మాట మాట అనుకున్నా వాటిని అక్కడికక్కడ వదిలెయ్యాలి. ఇలా చేస్తే సంతోషంగా ఉండవచ్చు. ద్వేషాన్ని వదిలి జీవితంలో ముందుకు సాగవచ్చు.

ఇవి కూడా చదవండి..

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 11 , 2024 | 05:12 PM