ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Toothpaste: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ నేచురల్ టూత్ పేస్ట్ వాడితే.. దంతాల సమస్యలన్నీ మాయమవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 06 , 2024 | 06:03 PM

దంతాలు ఆరోగ్యంగా ఉండాలని మార్కెట్లో దొరికే చాలా టూత్ పేస్ట్ లు ట్రై చేసి విసిగిపోతుంటారు. ఈ టూత్ పేస్ట్ ఇంట్లోనే తయారుచేసుకుని వాడితే ఫలితాలు చూసి షాకవుతారు.

Toothpaste: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ నేచురల్ టూత్ పేస్ట్ వాడితే.. దంతాల సమస్యలన్నీ మాయమవ్వాల్సిందే..

నోటి ఆరోగ్యం విషయానికి వస్తే దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్లగా మంచి పలు వరుసతో ఉంటే చాలా మంది ఎంతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడతారు. చాలా హాయిగా నవ్వేస్తారు. ఏదైనా తినాలన్నా, తాగలన్నా ఎలాంటి సంకోచం ఉండదు. కానీ దంతాల మీద గార, పాచి, దంతాలు రంగు మారడం వంటి సమస్యలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా నలుగురిలో కలవాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా సంకోచిస్తారు. ఈ దంత సమస్యలకు చెక్ పెట్టడానికి మార్కెట్లో దొరికే చాలా రకాల టూత్ పేస్ట్ లు మార్చి మార్చి వాడుతుంటారు. కానీ ఇంట్లోనే తయారు చేసుకునే ఈ టూత్ పేస్ట్ వాడితే దంతాల సమస్యలన్నీ మాయమవుతాయి.


కావలసిన పదార్థాలు..

అలోవెరా టూత్ పేస్ట్..

అలోవేరాను చర్మ సంరక్షణలో, కేశ సంరక్షణలో మాత్రమే కాకుండా దంత సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అలోవెరాను టూత్ పేస్ట్ తయారీ కోసం ఉపయోగించడం వల్ల దంతాలు చాలా సురక్షితంగా ఉంటాయి.


ఎలా తయారు చేయాలి?

అలోవెరా టూత్ పేస్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

అలోవెరా జెల్.. రెండు స్పూన్లు

బేకింగ్ సోడా.. రెండు స్పూన్లు

కొబ్బరినూనె.. ఒక స్పూన్

పుదీనా ఆకులు.. కొన్ని


తయారు విధానం..

పుదీనా తప్ప పై పదార్థాలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక అందులో కొన్ని పుదీనా ఆకుల సారాన్ని వేయాలి. లేకపోతే పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేయాలి. ఇప్పుడు టూత్ పేస్ట్ రెఢీ అయినట్టే..

తయారు చేసుకున్న టూత్ పేస్ట్ ను ఒక గాజు కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. పాడు కాకుండా ఉండటం కోసం దీన్ని ఫ్రిడ్జ్ లో అయినా నిల్వ చేయవచ్చు.

Updated Date - Nov 06 , 2024 | 06:03 PM