Dark Skin : ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య పోవాలంటే.. ఇలా ట్రై చేయండి..!
ABN, Publish Date - Mar 30 , 2024 | 04:04 PM
జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి
పెరుగుతున్న కాలుష్యం, వయసు కారణంగా ముఖం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పుడుతూ ఉంటాయి. ఈ సమస్య ఉంటే, మరికొందరికి సూర్యకిరణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా రావచ్చు. సాధారణంగా బుగ్గలపై, ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీనికి బెస్ట్, సింపుల్ హోం రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం.
ఈ మచ్చలు ఎందుకు వస్తాయి..
ముఖం మీద మచ్చలు శరీరతత్వాన్ని బట్టి వస్తుంటాయి. వీటిలో రకరకాలు ఉంటాయి. వయస్సుతో పాటు చర్మంపై అనేక ప్రభావాలు పడుతుంటాయి. మొటిమలు, మచ్చలు, హార్లోన్ల సమతుల్యత లోపం వల్ల, వంశపారపర్యంగా వస్తుంటాయి. మానసికమైన కుంగదీస్తాయి కూడా. హెపర్ పిగ్మెంటేషన్ కూడా దారితీస్తుంది. సూర్య కిరణాల్లోని అతి నీలలోహిత కిరణాలు చర్మానికి తగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవాలంటే మాత్రం ఇంటి చిట్కాలు ఇవే..
టమోటా, ముల్తాని మట్టి.. టమోటా రసంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఉంచి కడిగేయాలి. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలను నెమ్మదిగా తగ్గిస్తుంది.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
బంగాళ దుంప.. బంగాళ దుంపల రసంలో ముంచిన దూదితో మచ్చలపై పూయాలి. ఇది ముఖాన్ని కాంతి వంతంగా మారుస్తుంది.
టమోటా, కలబంద...ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా ఉత్తమంగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలకు రాసుకుని 20 నిమిషాలు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల క్రమంగా మచ్చలు తగ్గుతాయి.
నిమ్మరసం.. రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె ముఖానికి రాయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి మెరుపును ఇస్తుంది.
పాల ఉత్పత్తులు.. వెన్న మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో కాస్త పసుపు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే మంచి మార్పు కనిపిస్తుంది. మేకపాలలో జాజికాయను అరగదీసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంగు మచ్చలు తగ్గుతాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 04:04 PM