ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఇలా చేస్తే మీ శరీరంలో కొవ్వు ఈజీగా కరిగిపోతుంది..

ABN, Publish Date - Jul 02 , 2024 | 10:33 AM

ఆధునిక కాలంలో చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎక్కువమందిలో కనిపించే సమస్య ఊబకాయం. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

Health Tips

ఆధునిక కాలంలో చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎక్కువమందిలో కనిపించే సమస్య ఊబకాయం. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. శ్రమ అధికంగా లేకపోవడం.. తీసుకున్న ఆహారానికి (Food) తగిన పని చేయకపోవడంతో పాటు.. అధిక సమయం కూర్చొని పనిచేయండ, ఖాళీగా ఉండే సమయంలో మంచంపై ఎక్కువుగా జారపడటం వలన ఊబకాయం సమస్యతో ఎక్కువమంది బాధపడుతుంటారు. శరీరంలో(Body) కొవ్వు పెరగడం వలన బరువు పెరుగుతుంటారు. శరీరానికి శ్రమ లేకపోవడంతో తొడలలో కొవ్వు పెరిగిపోతుంది. దీనిని తగ్గించడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల యోగసనాలు చేయడం ద్వారా శరీరంలో కొవ్వు సులభంగా కరిగిపోతుంది. మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. మానసిక శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో ఊబకాయం లక్షణాలు ఎక్కువుగా కనిపిస్తాయి. రోజులో ఎక్కువ భాగం కూర్చోవటానికే పరిమితం అవుతుండటంతో శరీరాన్ని మోసే దిగువ శరీరానికి పనిలేకపోవడంతో, ఆ భాగమంతా బలహీనపడుతుంది. అలాగే తుంటి, తొడలలో అదనపు శరీర కొవ్వు పేరుకుపోతుంది. తొడలను తిరిగి సరైన ఆకృతిలోకి తీసుకువచ్చేందుకు వ్యాయామాలు చేయాలి. కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా తుంటి, తొడల కండరాలు మీ శరీర బరువును భరిస్తాయి. శరీరంలో బరువును తగ్గించే ఆసనాలు ఏమిటో తెలుసుకుందాం.


తడాసనం

తడాసనాన్ని సమస్థితి అని కూడా అంటారు. రెండు కాళ్లను పాదాలు తగిలేలా దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడాలి. ఆపై మీ చేతులను పైకి చాచి ఉంచాలి. మెల్లగా కళ్ళు మూసుకొని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచాలి. సాధ్యమైనంత సేపు ఈ భంగిమలో ఉండేందుకు ప్రయత్నించాలి.


ఉత్కటాసనం

ఈ ఆసనాన్ని ప్రతిసారీ 30 సెకన్ల విరామంతో 5 సెట్‌ల పాటు వేయాల్సి ఉంటుంది. ఉత్కటాసనం వేసేందుకు సమస్థితితో ప్రారంభించాలి. హృదయ చక్రం వద్ద నమస్కార ముద్రలో ఉండి, మీ చేతులను పైకి లేపాలి. మోకాళ్ల వద్ద 90 డిగ్రీల వంపుతో మీ పెల్విస్ నేలకి సమాంతరంగా ఉందని నిర్ధారించుకోవాలి. మీ దృష్టిని నమస్కారం వైపు కేంద్రీకరించండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.


ఏక పాదాసనం

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపి ఉంచే భంగిమ ఇది. నమస్కార ముద్రతో ప్రారంభించాలి. మీ వీపును నిటారుగా ఉంచి, మీ చేతులను పైకి చాచాలి. ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు మీ వీపు భాగాన్ని ముందుకు వంచాలి. నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచాలి. చేతులను మీ చెవుల పక్కన ఉంచాలి. నెమ్మదిగా మీ కుడి కాలును పైకి ఎత్తాలి. దానిని నిటారుగా వెనకకు చాచి ఉంచాలి. నేలపై ఒక చోట మీ చూపులను కేంద్రీకరించాలి. ఇలా ఒకవైపు కాగానే మరోవైపు ఇలానే చేయాలి.


ప్రపదాసనం

మలాసనం లేదా వజ్రాసనంతో ప్రారంభించాలి. పాదాలను ఒకచోట చేర్చి, శరీరాన్ని మీ కాలి మడమల మీద సమతుల్యం చేయాలి. వీపును నిటారుగా ఉంచాలి. అరచేతులను రెండు పక్కలా చాచి, కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించాలి. ఈ భంగిమలో 10 నుంచి 20 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.


వృక్షాసనం

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపే భంగిమ ఇది. సమస్థితిలో నిలబడి ప్రారంభించాలి. మీ కుడి కాలును ఎత్తి, మీ ఎడమ లోపలి తొడపై ఉంచాలి. మీ అరచేతులతో పాదానికి మద్దతు ఇవ్వవచ్చు. మీ హృదయ చక్రం వద్ద ప్రాణం ముద్రలో మీ అరచేతులను కలపి, ఆకాశం వైపు ఎత్తండి. మరో కాలుతో అదే పునరావృతం చేయాలి.


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Health News and Latest Telugu News

Updated Date - Jul 02 , 2024 | 10:33 AM

Advertising
Advertising