ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Millet vs Wheat: మిల్లెట్స్ రోటీలు మంచివా? గోధుమ రోటీలు బెస్టా? ఆరోగ్యానికి ఏవి మంచివంటే..!

ABN, First Publish Date - 2024-02-07T21:04:08+05:30

రొట్టెలు ఆరోగ్యానికి చాలామంచివి అయినా పోషకాల పరంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా మిల్లెట్, గోధుమ రొట్టెలలో ఏవి మంచివో తెలుసుకుంటే..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అనుకునే చాలామంది ఎంపిక రొట్టెలు. చపాతీలు తినేవారు కొందరైతే.. రాగులు, జొన్నలు, సద్దలు వంటి ధాన్యాలతో రొట్టెలు చేసుకునేవారు కొందరు. చపాతీలు చాలా విరివిగా ఉపయోగించినప్పటికీ.. కొందరు ఆరోగ్య దృష్ట్యా రాగులు, జొన్నలు, సద్దలు వంటి మిల్లెట్ల పిండితో చేసిన రొట్టెలు తీసుకుంటారు. అయితే మిల్లెట్లతో చేసిన రొట్టెలు మంచివా? గోధుమ పిండితో చేసిన రొట్టెలు మంచివా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మిల్లెట్లు, గోధుమ పిండి వీటిలో దేనితో చేసిన రొట్టెలు మంచివో ఒకసారి తెలుసుకుంటే..

గ్లూకోజ్ కంటెంట్..

గోధుమలలో గ్లూటెన్ ఉంటుంది. దీనికారణంగా గోధుమలు ఆరోగ్యానికి మంచివే.. కానీ గ్లూటెన్ సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి గోధుమలు మంచివి కాదు. అదే మిల్లెట్లలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి గోధుమల కంటే మిల్లెట్లు మంచి ఎంపిక.

ఇది కూడా చదవండి: చిటికెడు జాజికాయ పొడిని రోజూ తీసుకుంటే.. జరిగేదిదే..!


రక్తంలో చక్కెర ప్రభావం..

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మిల్లెట్స్ రొట్టెలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గోధుమ రొట్టెలు ఆరోగ్యానికి మంచివే అయినా, అవి సమతుల్య ఆహారంలో భాగం అయినా రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు గోధుమ రొట్టెల మీద ఎక్కువ ఆధారపడకపోవడమే మంచిది.

బరువు..

మిల్లెట్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గోధుమ రొట్టెలలో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది కూడా మంచి ఆప్షన్. అయితే చక్కెర స్థాయిల సమస్య లేనివారు అయితే గోధుమలను బరువు నియంత్రణ కోసం వాడొచ్చు.

గుండె ఆరోగ్యం..

మిల్లెట్ రొట్టెలలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్‌ కూడా హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గోధుమలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే అంశాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఏది బెస్టు..

గోధుమలు, మిల్లెట్లు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవి. వేటి ప్రయోజనాలు వాటికున్నాయి. ఇకపోతే రెండింటిని పోల్చినప్పుడు మాత్రం గోధుమల కంటే మిల్లెట్లు అన్ని వర్గాల వారికి ఆరోగ్యపరంగా మంచివి. సాధారణ వ్యక్తులకు అయితే రెండూ ఆరోగ్యకరమే..

ఇది కూడా చదవండి: Grapes: నలుపు Vs ఎరుపు Vs ఆకుపచ్చ.. ఏ ద్రాక్షలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మేలంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-07T21:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising