ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Money Plant Vs Dengue: మనీ ప్లాంట్ అదృష్టాన్నే కాదు.. డెంగీని తెచ్చిపెడుతుంది.. ఈ నిజాలు తెలుసుకోండి..!

ABN, Publish Date - Aug 01 , 2024 | 03:52 PM

మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో అదృష్టం కోసం, ఇంట్లో ధనం వృద్ధి చెందడం కోసం పెంచుకుంటారు. ఈ మొక్కను పెరట్లోనో, కుండీలలోనో పెంచాల్సిన అవసరం లేదు.. దీన్ని ఒక చిన్న గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ఉంచినా ఎంచక్కా పెరుగుతుంది. అయితే..

Money Plant Vs Dengue

మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో అదృష్టం కోసం, ఇంట్లో ధనం వృద్ధి చెందడం కోసం పెంచుకుంటారు. ఈ మొక్కను పెరట్లోనో, కుండీలలోనో పెంచాల్సిన అవసరం లేదు.. దీన్ని ఒక చిన్న గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ఉంచినా ఎంచక్కా పెరుగుతుంది. ఇంటికి అదనపు అలంకరణ కూడా ఇస్తుంది. అయితే మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో ధనం వృద్ధి చెందడం, అదృష్టం కలిసిరావడం సంగతి పక్కన పెడితే ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు. అదెలాగో.. దీని వెనుక కారణాలు ఏంటో తెలుుసుకంటే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!


  • చాలామంది మనీ ప్లాంట్ ను ఒక చిన్న కంటైనర్ లేదా గాజు సీసాలో నీరు పోసి అందులో మొక్కను పెంచుతుంటారు. ఇది పడక గది, వంట గది, హాల్ ఇలా ఏ ప్రాంతంలో అయినా, చిన్న కిటికి లలో అయినా సులభంగా ఇమిడిపోతుంది. అయితే మనీ ప్లాంట్ లో పోసిన నీటిలో డెంగ్యు దోమలు అభివృద్ది చెందుతాయనే విషయం బయటపడింది. ఇది ఈ వర్షాకాలంలో చాలా సులభంగా అనారోగ్యాన్ని చేకూరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.

  • గాజు సీసాలలో మనీ ప్లాంట్ లు పెంచేవారు వాటిలో నీరు పోసి మొక్కను పెంచుతుంటారు. ఇలాంటి వారు గాజు సీసాలలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. లేకపోతే ఈ నీటిలో డెంగ్యూ వృద్ధి చెందుతాయి.

రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!


  • డెంగ్యూ లార్వాలు మనీ ప్లాంట్ నీటిలో ఏర్పడతాయి. నీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే ఈ లార్వాలు క్రమంగా వృద్ధి చెంది డెంగ్యూ దోమలు ఏర్పడతాయి.

  • వాస్తవానికి మనీ ప్లాంట్ లో ఉండే నీరు చాలా స్వచ్చంగా ఉంటుంది. డెంగ్యూ లార్వా కూడా స్వచ్చమైన నీటిలో వృద్ధి చెందుతుంది. ఈ కారణంగా మనీ ప్లాంట్ లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది.

  • మనీ ప్లాంట్ ను పడక గదిలోనూ, నిద్రించే ప్రాంతాలకు దగ్గర పెట్టుకోకుండా ఉండటం మంచిది. అంతే కాదు ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేవారు నిద్రించే సమయంలో దోమతెరలు వాడాలి. ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి.

మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఇన్ని రోగాలు వస్తాయా..!

వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 01 , 2024 | 03:52 PM

Advertising
Advertising
<